ట్రంప్ కి అన్ని ఆస్తులు ఎలా వచ్చాయంటే....నిజాలు బయటపెట్టిన మేరీ ట్రంప్..!!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి ఆస్తులు ఉన్నాయో ట్రంప్ కే తెలియదంటారు.ఎన్నో విలువైన కంపెనీలు, గోల్ఫ్ మైదానాలు, హోటల్స్ ఇలా ప్రతీ రంగంలో ట్రంప్ తనదైన శైలిలో దూసుకు పోతున్నారు.

 Mary Trump Exposed The Facts  About How Trump Got All The Assets , Donald Trump,-TeluguStop.com

ట్రంప్ కి అమెరికా వ్యాప్తంగానే కాదు పలు దేశాలలో సైతం ఎన్నో విలువైన ఆస్తులు ఉన్నాయని వాటి వ్యవహారాలూ ట్రంప్ సతీమణి, కూతురు కొడుకులు చూసుకుంటారు. అయితే వెలకట్టలేని ఇన్ని ఆస్తులు ట్రంప్ కి ఎలా వచ్చాయి.

కష్టపడి సంపాదించినవా.లేక మరొక రూపంలో ట్రంప్ కట్టబెట్టుకున్నాడా అనే విషయాలు ప్రపంచానికి ఇప్పటి వరకూ తెలియదు.కానీ ట్రంప్ సోదరుడి కూతురు మేరీ ట్రంప్ రూపంలో ఇప్పుడు ఒక్కో నిజం బయట పడుతోంది.ఇందులో వాస్తవం ఏ పాళ్ళలో ఉందొ తెలియదు కానీ మేరీ తన పుస్తకంలో చేసిన ఆరోపణలు మాత్రం సంచలనం సృష్టిస్తున్నాయి.

గడించిన కొన్ని రోజులుగా ట్రంప్ టార్గెట్ గా బాణాలు సందిస్తున్న మేరీ ట్రంప్ తన పుస్తకంలో ఉన్న అంశాలు నూటికి నూరు శాతం నిజమైనవేనని బలంగా చెప్తున్నారు.ఈ క్రమంలోనే ఆమె ట్రంప్ కి అన్నో ఆస్తులు ఎలా వచ్చాయి అనే విషయాన్ని వెల్లడించారు.

Telugu America Trump, Donald Trump, Golf Stadiums, Hotels, Mary Trump, Trump-

ట్రంప్ తండ్రి తన అన్న ( మేరీ తండ్రి ) అయిన ఫెడ్ ట్రంప్ కి తన వ్యాపార బాధ్యతలు అప్పగించారని.అయితే తన తండ్రికి పైలెట్ అవ్వాలని ఉండేదని.కొన్ని రోజులు గడించిన తరువాత నేను పైలెట్ అవుతానని తండ్రి ఇచ్చిన బాధ్యతల నుంచీ తప్పుకోగానే అదును చూసి డోనాల్డ్ ట్రంప్ వ్యాపారాన్ని తీసుకున్నారని, తద్వారా ఓ గొప్ప వ్యాపార వేత్త అనే పేరు వచ్చింది, ఆ వ్యాపారంలో డబ్బు వచ్చింది తప్ప సొంతగా ట్రంప్ ఏమీ సాధించింది లేదని మరీ రాసుకొచ్చారు.తన తండ్రి ఆలోచనలు, శక్తి సామర్ధ్యాలతో పోల్చితే ట్రంప్ గొప్పవాడు కాదని, తన తాతయ్య ట్రంప్ ని ఎప్పుడూ తిడుతూ ఉండేవారని ఎందుకు పనికిరాని వాడు అంటూ తిట్టేవారని మేరీ తన పుస్తకంలో వెల్లడించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube