టీడీపీ సీనియర్ నేత మారుతీ వరప్రసాద్ మృతి

అనారోగ్యంతో టీడీపీ సీనియర్ నేత మారుతీ వరప్రసాద్ కన్నుమూశారు.ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో టీడీపీ కీలక నేతగా కొనసాగుతున్న ఆయన హఠాత్మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రముఖులు తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

 Pulivendula, Tdp, Senior Leader, Maruthi Varaprasad, Dead , Nara Lokesh, Chandra-TeluguStop.com

ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని అందించారు.అటవీశాఖ మాజీ డైరెక్టర్ గా, టీడీపీలో కీలక నేతగా వ్యవహరించిన మారుతీ వరప్రసాద్ అందరికీ సుపరిచితుడు.

పులివెందుల నియోజకవర్గంలో మారుతీ వరప్రసాద్ కీలక బాధ్యతలు చేపట్టారు.నియోజకవర్గంలో పార్టీ పటిష్టత కాపాండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు.కీలక నేతగా వ్యవహరిస్తూ పార్టీ అభివృద్ధికి సాయపడేవాడు.గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కాగా పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం మరణించారు.ఈ మేరకు టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాట్లాడుతూ.

‘‘పులివెందుల నియోజకవర్గం తెరాస పార్టీ కీలక నేత మారుతీ వరప్రసాద్ మరణించడం బాధాకరం.పార్టీ సీనియర్ నాయకుడిగా, అటవీశాఖ మాజీ డైరెక్టర్ గా ప్రజలకు ఎన్నో సేవలను అందించారు.

ఆయన ఆకస్మిక మరణం పార్టీకి తీరని లోటు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తాను.

వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.’’ అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube