2018 నుండి 2020 వరకు కొన్న కార్లని రీకాల్ చేస్తున్న మారుతి..!

ఇదివరకు ఎప్పుడు లేని విధంగా మారుతి సుజుకి తమ కార్లని వెనక్కి పిలుస్తుంది.దేశవ్యాప్తంగా 1,81,754 కార్లని రీకాల్ చేస్తున్నట్టు తెలుస్తుంది.2018 మే 4 నుండి 2020 అక్టోబర్ 27 వరకు మధ్య కాలంలో తయారైన కార్లలో మోటార్ జెనరేటర్ యూనిట్ లో లోపం ఉన్నట్టు గుర్తించారు మారుతి సుజుకి నిర్వహాకులు.అందుకే సంబందించిన మధ్య కాలంలో కొన్న కార్లని మారుతి సుజుకి రీ కాల్ చేస్తుంది.

 Maruthi Suzuki Recall Program 2018 To 2020 Models, Maruthi Suzuki Recall Program-TeluguStop.com

భారత ఆటోమొబైల్ రంగంలో ఇదొక అతిపెద్ద రీకాల్ అని చెప్పొచ్చు.

మారుతి సుజుకి నుండి వచ్చిన సియాజ్, ఎర్టిగా, విటారా బ్రెజా, ఎస్ క్రాస్, ఎక్సెల్6 మోడళ్లకు ఈ రీ కాల్ అప్లై చేస్తున్నారు.

ఆయా కార్లు స్వచ్చందంగా వెనక్కి పిలుస్తున్నామని మారుతి సుజుకి తెలిపింది.కార్లని తనిఖీ చేసి.

అవసరమైన విడి భాగాలు అమర్చేందుకు సిద్ధమని మారుతి సుజుకి ప్రకటించింది.అంతేకాదు దీనికోసం కంపెనీ ఎలాంటి ఛార్జ్ వసూలు చేయదని కూడా వెల్లడించారు.

ఇది పూర్తిగా మారుతి సుజుకి ఫ్రీ సర్వీస్ చేస్తుందని ప్రకటించారు. ఇండియాలో అత్యధిక సేల్స్ కలిగిన మారుతి సుజుకి నుండి ఈ రీకాల్ ప్రోగ్రాం అందరిని సర్ ప్రైజ్ చేస్తుంది.

 మారుతి సుజుకి చేస్తున్న ఈ రీ కాల్ ప్రోగ్రాం ద్వారా మారుతి కస్టమర్స్ కు స్పెషల్ ఆఫర్ ఇస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube