మారుతి 'పక్కా కమర్షియల్‌' ఉందా? లేదా? చెప్తారట!

భలే భలే మగాడివోయ్ మరియు ప్రతి రోజు పండుగే వంటి సూపర్‌ హిట్‌ కమర్షియల్‌ సినిమా లను తెరకెక్కించిన దర్శకుడు మారుతి ప్రస్తుతం సంతోష్‌ శోభన్‌ తో యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ లో ఆహా ఓటీటీ కోసం ఒక సినిమా ను తెరకెక్కిస్తున్న విషయం తెల్సిందే.ప్రస్తుతం సినిమా కు సంబంధించిన చిత్రీకరణ దాదాపుగా ముగింపు దశకు వచ్చిందని వార్తలు వస్తున్నాయి.

 Maruthi Pakka Commercial Movie Shooting Update-TeluguStop.com

ఈ సినిమా కంటే ముందే గోపీచంద్‌ తో మారుతి పక్కా కమర్షియల్‌ సినిమా ను ప్రకటించాడు.కాని పక్కా కమర్షియల్‌ సినిమా ను షూటింగ్‌ మొదలు పెట్టకుండా అనూహ్యంగా సంతోష్‌ శోభన్‌ తో సినిమా ను మారుతి చేయడం వల్ల మీడియా వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో చర్చ మొదలు అయ్యింది.

గోపీచంద్‌ తో సినిమా ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్న ఈ సమయంలో చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి ఒక కీలక అప్ డేట్‌ ను ఇచ్చేందుకు సిద్దం అయ్యారు.

 Maruthi Pakka Commercial Movie Shooting Update-మారుతి పక్కా కమర్షియల్‌’ ఉందా లేదా చెప్తారట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Gopichand, Maruthi And Gopichand, Maruthi Film, Pakka Comercial, Uv Creations-Movie

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పక్కా కమర్షియల్‌ సినిమా ఉందని.అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పడంతో పాటు హీరోయిన్‌ విషయంలో స్పష్టత ఇచ్చేలా ఈ రోజు సాయంత్రం ప్రకటన వెలువడబోతుందని తెలుస్తోంది.పక్కా కమర్షియల్‌ గా ఉండే ఈ పక్కా కమర్షియల్‌ చిత్రం తో మరో సారి దర్శకుడు మారుతి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటాడనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.

ఇక మారుతి దర్శకత్వంలో ప్రస్తుతం రూపొందుతున్న సినిమా అదే సంతోష్‌ శోభన్‌ సినిమా కాస్త అడల్డ్‌ కంటెంట్‌ ఉంటుందని కూడా అంటున్నారు.కేవలం నెల రోజుల్లోనే రూపొందుతున్న ఈ రొమాంటిక్ లవ్‌ స్టోరీ మూవీ ఆహా లో స్ట్రీమింగ్‌ కోసం భారీ ఆఫర్‌ ను దక్కించుకుంది.

మారుతి సినిమా అంటే ఖచ్చితంగా యూత్‌ ఆడియన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.కనుక ప్రతి రోజు పండుగ మాదిరిగానే మరో కమర్షియల్‌ మూవీ గా ఇది నిలుస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.

#Gopichand #Pakka Comercial #UV Creations #MaruthiAnd #Maruthi Film

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు