మాస్ హీరో గోపీచంద్ కెరియర్ రిస్క్ లో ఉందని చెప్పొచ్చు.చేస్తున్న సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర చతికిలపడటంతో గోపీచంద్ ఈసారి హిట్ టార్గెట్ తో వస్తున్నాడు.
సంపత్ నంది డైరక్షన్ లో వస్తున్న సీటీమార్ సెప్టెంబర్ 10న రాబోతుంది.ఈ సినిమా ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.
ఇక ఈ సినిమా ఫలితాన్ని బట్టి గోపీచంద్ మారుతి డైరక్షన్ లో చేస్తున్న సినిమా ఓపెనింగ్స్ ఆధారపడి ఉన్నాయని చెప్పొచ్చు.మారుతి డైరక్షన్ లో గోపీచంద్ హీరోగా పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమాలో గోపీచంద్ లాయర్ గా కనిపించనునాడు.సీటీమార్ సినిమాతో గోపీచంద్ హిట్ కొడితే ఆ తర్వాత మారుతి సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఒకవేళ సీటీమార్ కూడా అనుకున్న విధంగా లేకపోతే మాత్రం మారుతి సినిమాపై గోపీచంద్ ఫ్యాన్స్ ఆశలు పెంచుకునే అవకాశం ఉంది.మొత్తానికి గోపీచంద్ కు సీటీమార్, పక్కా కమర్షియల్ ఈ రెండు సినిమాల మీదే కెరియర్ ఆధారపడి ఉందని చెప్పొచ్చు.
ఈ సినిమాల తర్వాత తేజ డైరక్షన్ లో ఒక సినిమా చేయాల్సి ఉందని తెలిసిందే. ఆ సినిమాకు సంబందించిన డీటైల్స్ త్వరలో తెలుస్తాయి.