భలే భలే స్క్రిప్టు ఫైనల్ చేసిన డైరెక్టర్

నేచురల్ స్టార్ నాని నటించిన రీసెంట్ మూవీ ‘వి’ ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయ్యి మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న చిత్ర యూనిట్, ఈ సినిమాకు యావరేజ్ టాక్ రావడంతో నిరాశకు లోనయ్యింది.

 Maruthi Finalizes Script For Nani Movie, Maruthi, Nani, Bhale Bhale Magadivoyi,-TeluguStop.com

ఇక నాని ప్రస్తుతం తన నెక్ట్స్ చిత్రాలను లైన్‌లో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు.ఈ క్రమంలో ‘టక్ జగదీష్’ చిత్ర షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు నాని రెడీ అవుతున్నాడు.

ఈ సినిమా తరువాత ‘శ్యాం సింగ్ రాయ్’ అనే సినిమాలో నాని నటిస్తున్నాడు.ఈ సినిమా ఇంకా పట్టాలెక్కకముందే, మరో సినిమాను ఓకే చేసే పనిలో పడ్డాడు.

దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో నాని ఓ సినిమా చేసేందుకు ఆసక్తి చూపుతున్నాడు.గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.

ఈ సినిమా నాని కెరీర్‌లో బిగ్గె్స్ట్ హిట్‌లలో ఒకటిగా నిలిచింది.ఆ తరువాత వీరిద్దరు కలిసి మరో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నారు.

కానీ అది కుదర్లేదు.అయితే ఈసారి నాని కోసం ఓ పర్ఫెక్ట్ స్క్రిప్టును రెడీ చేస్తున్నాడట దర్శకుడు మారుతి.

ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై రాబోయే సినిమాలో నానిని మరోసారి డైరెక్ట్ చేయనున్నాడు మారుతి.కాగా నానితో చేయబోయే సినిమా కోసం ఫుల్ లెన్త్ ఎంటర్‌టైనర్ కథను రెడీ చేశాడట మారుతి.

ఈ సినిమా స్క్రిప్టును త్వరలో నానిని వినిపించి ఓకే చేయించాలని మారుతి భావిస్తున్నాడు.అయితే ఈ కాంబినేషన్‌లో రాబోయే ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో అనే అంశంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

మరి ఈ కాంబోలో రాబోయే రెండో సినిమా ఎలాంటి కథతో వస్తుందో తెలియాలంటే మాత్రం సినిమా అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వరకు ఆగాల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube