మెగా డైరెక్టర్‌కు అరవింద్ ఛాన్స్.. ఎందుకో తెలుసా?  

Maruthi Allu Aravind Ott - Telugu Aha, Allu Aravind, Maruthi, Ott, Web Series

ప్రస్తుతం సినిమా రంగానికి చెందిన అన్ని పనులు కూడా స్తంభించి పోవడంతో ప్రేక్షకులు పెద్ద ఎత్తున డిజిటల్ ప్లాట్‌ఫాంలకు అంకితం అయ్యారు.ఈ క్రమంలో ఓటీటీలకు అదిరిపోయే క్రేజ్ ఏర్పడటంతో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా ఇప్పటికే ఆహా అనే యాప్‌ను ప్రారంభించారు.

 Maruthi Allu Aravind Ott

ఇందులో భాగంగా ప్రేక్షకులను ఆకట్టుకునే సరికొత్త వెబ్ సిరీస్, షోలు, సినిమాలను ఈ యాప్‌లో పెట్టేందుకు నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు.

అయితే ప్రేక్షకులను ఆకట్టుకునేందుక సరికొత్త కాన్సెప్టులతో తెరకెక్కే వెబ్ సిరీస్‌లను డైరెక్ట్ చేసేందుకు పలువురు ట్యాలెంటెడ్ డైరెక్టర్స్‌ను తీసుకుంటున్నారు.

మెగా డైరెక్టర్‌కు అరవింద్ ఛాన్స్.. ఎందుకో తెలుసా-Gossips-Telugu Tollywood Photo Image

ఈ క్రమంలో మెగా ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఉన్న దర్శకుడు మారుతిని ఓ ఆసక్తికరమైన వెబ్‌సిరీస్‌ను డైరెక్ట్ చేసేందుకు అల్లు అరవింద్ ఒప్పించినట్లు తెలుస్తోంది.ఈ మేరకు మారుతితో భారీ రెమ్యేనరేషన్ ఢీల్ కుదుర్చుకున్నారట అల్లు అరవింది.

మారుతి చెప్పిన స్క్రిప్టు అల్లు అరవింద్‌కు బాగా నచ్చడంతో ఈ వెబ్ సిరీస్‌ను త్వరలోనే పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు.

మొత్తానికి ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాంలో తొలిసారి ఓ పాపులర్ డైరెక్టర్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

మరి మారుతి ఈ వెబ్ సిరీస్‌ను ఎలాంటి కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.ఇక ఈ వెబ్ సిరీస్‌లో నటీనటులు ఎవరనేది కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

మారుతి రాకతో ఆహా యాప్‌కు అదిరిపోయే క్రేజ్ ఏర్పడుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Maruthi To Direct Web Series For Allu Aravind Related Telugu News,Photos/Pics,Images..