కన్నీళ్లు పెట్టిస్తున్న అమర్ జవాన్ వాట్సాప్ చాట్!  

మనదేశంలో మనంఎంతో ధైర్యంగా మన కార్యకలాపాలను కొనసాగిస్తున్నామంటే అందుకు కారణం మన దేశ సరిహద్దుల్లో సైనికులు మన దేశాన్ని కాపు కాయటం వల్ల మనం ఎంతో సుఖసంతోషాలతో గడుపుతున్నాము.దేశ సరిహద్దులలో ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో నైనా మన దేశానికి రక్షణగా ముందుండి దేశాన్ని నడిపిస్తున్నవారు మన జవానులు.

TeluguStop.com - Martyred Jawans Whatsapp Chat Brings Tears To Netizens This Is A Soldiers Life In Jammu Kashmir

అయితే వీరు దేశ రక్షణ లో నిమగ్నమై వారి ప్రాణాలను, సైతం త్యాగం చేస్తుంటారు.దేశ రక్షణలో ఉన్న సైనికుల గురించి ఏ క్షణం ఎలాంటి వార్తలు వినాల్సివస్తుందోనని కుటుంబ సభ్యులు నిత్యం ఆందోళన చెందుతుంటారు.

ప్రస్తుతం ఇలాంటి హృదయ విదారక ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది.

TeluguStop.com - కన్నీళ్లు పెట్టిస్తున్న అమర్ జవాన్ వాట్సాప్ చాట్-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లా చలిగావ్ గ్రామానికి చెందిన యశ్ దిగంబర్ దేశ్‌ముఖ్(20) అనే యువకుడు చిన్నప్పటి నుంచి ఆర్మీలో సేవ చేయాలని ఎన్నో కలలు కనేవాడు.

అయితే గత సంవత్సరం కర్ణాటకలో జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్ లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన తన కళను నెరవేర్చుకున్నాడు.ఆర్మీ లో శిక్షణ అనంతరం విధులు నిర్వహించడానికి అతనిని జమ్మూ కాశ్మీర్ లోని సమస్యాత్మక ప్రాంతానికి పంపించారు.

ఆర్మీ లో విధులు నిర్వహిస్తున్న తన మిత్రుడికి దేశ్‌ముఖ్ మిత్రుడు బుధవారం వాట్స్ యాప్ చాట్ ద్వారా యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు.సదరు మిత్రుడు ఎలా ఉన్నావ్ అని అడగగా… అందుకు స్పందించిన దేశ్‌ముఖ్ నేను బాగానే ఉన్నాను.

కానీ మా గురించి తెలియనిది ఏముంది? ఇవాళ ఉంటాం… రేపు ఉండకపోవచ్చు? అంటూ తన మిత్రుడితో వాట్సాప్ చాటింగ్ చేశారు.అయితే తన మిత్రులకు చెప్పిన విధంగానే మరుసటి రోజు ఉగ్రవాదుల చేతిలో హతమయ్యాడు.

వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఎంతోమందిని కంటతడి పెట్టిస్తుంది.

శ్రీనగర్ లో తన సహచరులతో కలిసి ఒక ప్రాంతంలోజవాన్ యశ్ దేశ్‌ముఖ్ విధులు నిర్వహిస్తున్నారు.

ఇంతలో అకస్మాత్తుగా వచ్చిన ముగ్గురు తీవ్రవాదులు వీరిపై కాల్పులు జరిపారు.అయితే ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు జవాన్లు కుప్పకూలగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

అయితే చికిత్స పొందుతూ జవాన్లు వీర మరణం పొందారు.

ఉగ్రవాదుల దాడిలో అమరులైన ఇద్దరు జవానులలో ఒకరు యశ్ దేశ్‌ముఖ్ఈ దాడిలో ముగ్గురు తీవ్రవాదులు పాల్గొన్నట్టు వారిలో ఇద్దరు పాకిస్తాన్ కి చెందిన వారు కాగా మరొకరు స్థానికులు అని జమ్ము కాశ్మీర్ ఐజి తెలియజేశారు.

జమ్ము కాశ్మీర్ లో జరుగుతున్న జిల్లా అభివృద్ధి మండలి ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను భయబ్రాంతులకు గురి చేయడానికి ఇలాంటి దాడులకు పాల్పడుతున్నట్లు తెలియజేశారు.

#MartyredJawans #SrinagarTerror #Soldiers #Jammu Kashmir

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు