అమర జవాన్ నుండి భార్యకు ఫోన్.. నేను బ్రతికే ఉన్నా అంటూ..?

కొన్ని కొన్ని సార్లు తమ ప్రియమైన వ్యక్తి చనిపోయాడని కుటుంబ సభ్యులు బాధపడుతున్న సమయంలో ఎవరూ ఊహించని విధంగా వారు బతికి వస్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది చేతల్లో చూపించ లేనిది.ఇక్కడ ఒక కుటుంబానికి ఇలాంటి అనుభవమే ఎదురైంది.

 'martyred' Jawan Calls Up His Wife, Jawan, China India Border, Sunil Kumar, Thre-TeluguStop.com

ఇటీవలే చైనా భారత్ సరిహద్దులో జరిగిన ఘర్షణలో ఓ జవాన్ మరణించాడు.ఇక ఆ తర్వాత జవాను మరణించడంతో అతని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

కాని జూన్ 17 వ తేదీన ఆ జవాన్ భార్యకు ఫోన్ వచ్చింది.

నేను బ్రతికే ఉన్న అంటూ ఆ జవాన్ ఫోన్లో చెప్పడంతో ఆ మహిళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి.

జవాన్ మరణం తో విషాదంలో మునిగిపోయిన గ్రామం కూడా సంబరాల్లో మునిగి పోయింది.ఈ ఘటన బీహార్లోని సరణ్ జిల్లాలో చోటు చేసుకుంది.ఆ జవాన్ పేరు సునీల్.ఇంత గందరగోళానికి కారణం చైనా భారత్ ఘర్షణలో అమరుడైన జవాన్ పేరు కూడా సునీల్ కావడం.

అంతేకాదు వీరి తండ్రి పేరు కూడా ఒకటి.వీరిద్దరూ ఒకే రాష్ట్రానికి చెందిన వారు.

కాగా సరిహద్దులో ఘర్షణలో అమరుడైన జవాన్ పేరు సునీల్ కుమార్ అతని తండ్రి పేరు సూఖ్ దేవ్ … కానీ ఆర్మీ అధికారులు మాత్రం సునీల్ కుమార్ కి బదులుగా సునీల్ రాయ్ కుటుంబానికి జవాన్ అమరుడైనట్లు సమాచారం ఇచ్చారు .ఇక ఈ విషయం మీడియా ద్వారా సునీల్ రాయ్ వరకు వెళ్లడంతో తాను వెంటనే భార్యకు ఫోన్ చేసి బతికే ఉన్నాను అంటూ చెప్పుకొచ్చాడు.కాగా సరిహద్దుల్లో ఘర్షణలో అమరులైనవారిలో బీహార్ రాష్ట్రానికి చెందిన జవాన్ లు ముగ్గురు ఉండగా అందులో సునీల్ కుమార్ ఒకరు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube