అమ్మ మరణంతో మహేష్‌ వేడుక రద్దు అభిమానుల నిరుత్సాహం  

Marshi Movie 50 Days Celebrations Postponed-hero Krishna,mahesh Babu,vijaya Nirmala Dead

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు నటించిన ‘మహర్షి’ చిత్రం నేటితో 50 రోజులు పూర్తి చేసుకుంది. 200 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్మాత దిల్‌రాజు భారీ వేడుకకు ప్లాన్‌ చేశారు. అయితే నేడు కృష్ణ గారి భార్య విజయనిర్మల మృతి చెందడటంతో వేడుకను రద్దు చేసినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. మహేష్‌ బాబు అమ్మ అంటూ ఆప్యాయంగా పిలిచే విజయ నిర్మల మృతితో ఆ కుటుంబ సభ్యులు అంతా కూడా శోకంలో ఉన్నారు..

అమ్మ మరణంతో మహేష్‌ వేడుక రద్దు అభిమానుల నిరుత్సాహం-Marshi Movie 50 Days Celebrations Postponed

ఈమద్య కాలంలో పెద్ద సినిమాలైనా చిన్న సినిమాలైనా 50 రోజులు ఆడటం గగనం అయ్యింది. అలాంటిది దాదాపు 200 థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో వేడుక అదిరి పోయేలా చేయాలని భావించారు. అభిమానులు కూడా ఇందుకోసం భారీగా తరలి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఇలాంటి సమయంలో విజయ నిర్మల గారు చనిపోవడంతో అంతా రద్దు అయ్యింది. ఇప్పుడు రద్దు అయిన కార్యక్రమం తర్వాత ఉంటుందా అనే విషయంపై క్లారిటీ లేదు..

మహేష్‌ బాబు 25వ చిత్రంగా రూపొందిన బ్లాక్‌ బస్టర్‌ మహర్షి చిత్రంకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంను దిల్‌రాజు, అశ్వినీదత్‌, పీవీపీలు కలిసి నిర్మించారు.

అద్బుతమైన నేపథ్యంలో ఈ చిత్రం రూపొందడంతో ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కొన్ని విమర్శలు వచ్చినా కూడా సినిమా ఏకంగా 100 కోట్ల షేర్‌ను రాబట్టి ఇండస్ట్రీ టాప్‌ చిత్రాల జాబితాలో నిలిచింది. అందుకే వేడుక భారీగా నిర్వహించాలని నిర్మాత భావించాడు. కాని అది కాస్త క్యాన్సల్‌ అవ్వడంతో ఫ్యాన్స్‌ నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు..