Ashu Reddy Ariyana: ఎయిర్పోర్ట్ లో టికెట్లు ఇచ్చేవాన్ని పెళ్లి చేసుకో.. అషు రెడ్డికి సలహా ఇచ్చిన అరియానా?

ఈమధ్య సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తున్న సెలబ్రెటీల లిస్టులో మొదటగా అషు రెడ్డి, అరియానా పేర్లు బాగా వినిపిస్తున్నాయి.ఎంతలా అంటే వీరు చేసే పోస్టులు చూస్తే అర్థమవుతుంది.

 Marry The One Who Gives Tickets At The Airport Ariana Advised Ashu Reddy , Marry-TeluguStop.com

ప్రతిరోజు తిండి లేకుండా ఉంటారేమో కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరిద్దరూ ఒక్క పోస్ట్ అయినా షేర్ చేయకుండా ఉండలేరు.ఇంట్లో కంటే ఎక్కువగా నెట్టింట్లో గడిపేస్తున్నారు ఈ బ్యూటీస్.

ఇక అషు రెడ్డి సోషల్ మీడియాలో డబ్స్మాష్ వీడియోస్ ద్వారా పరిచయమైతే అరియానా కూడా యూట్యూబ్ యాంకర్ గా పరిచయమైంది.జూనియర్ సమంత గా అషు రెడ్డికి బుల్లితెరపై అవకాశం వస్తే.

అరియానా కు మాత్రం రామ్ గోపాల్ వర్మ చేసిన బోల్డ్ ఇంటర్వ్యూ ద్వారా బుల్లితెరపై అడుగుపెట్టింది.గతంలో అషు రెడ్డి కూడా వర్మ తో బోల్డ్ ఇంటర్వ్యూ లో పాల్గొన్న సంగతి తెలిసిందే.

ఇక వీరిద్దరూ మొదటిసారిగా వేరువేరు సీజన్ లలో బిగ్ బాస్ లో అవకాశం అందుకోగా రెండోసారి నాన్ స్టాప్ బిగ్ బాస్ లో ఇద్దరు కలిసి ఆడారు.ఆ తర్వాత హౌస్ నుంచి బయటికి వచ్చాక వీరు మధ్య స్నేహబంధం మరింత బలంగా మారింది.

దీంతో అప్పటినుంచి ఎక్కడికి వెళ్ళినా వీరిద్దరూ కలిసి వెళ్లడం, కలిసి రీల్స్ చేయటం, ఫోటోలు దిగటం ఇలా ప్రతి ఒక్క విషయంలో బాగా రచ్చ రచ్చ చేస్తున్నారు.

Telugu Ariana, Ashu Reddy, Tickets Airport-Movie

అయితే అషు రెడ్డి ఎంత బోల్డుగా ఉంటుందో అందరికీ తెలిసిందే.తను వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ తను మాట్లాడే తీరు బోల్డ్ గానే ఉంటుంది.ఇంస్టాగ్రామ్ లో ఈమె పంచుకునే ఫోటోలు చూస్తే హీట్ ఎక్కడం గ్యారెంటీ.

ఎప్పుడైతే ఈమెతో అరియానా స్నేహాన్ని పెంచుకుందో అప్పటినుంచి అరియానా కూడా అషు లాగే తయారయింది.ఈ మధ్య ఈమె కూడా హాట్ హాట్ గా ఎక్స్పోజ్ చేస్తూ అందరి దృష్టిలో పడింది.

Telugu Ariana, Ashu Reddy, Tickets Airport-Movie

ఇక ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతూ ఫోటోషూట్ లు చేయించుకుంటూ కుర్రాళ్లకు మంచి స్టఫ్ ను అందిస్తున్నారు.ఇదంతా పక్కన పెడితే తాజాగా వీరిద్దరూ మరోసారి కలుసుకోగా దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది.అందులో వారితోపాటు ఎక్స్ప్రెస్ హరి కూడా ఉన్నాడు.అయితే అరియానా సెల్ఫీ వీడియో రికార్డ్ చేస్తూ.వెల్కమ్ టు ఇండియా అని అషు రెడ్డి కి చెప్పింది.

ఆ తర్వాత ఎయిర్ పోర్ట్ లో టికెట్లు ఇచ్చే వాడిని పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చింది.

దాంతో అషు రెడ్డి ఇద్దరం చేసుకుందాం అతన్నే అని అనటంతో.పక్కనే ఉన్న హరి అంటే ఇప్పుడు నేను ఎయిర్పోర్టులో టికెట్ అమ్ముకోవాలా అంటూ సరదాగా కామెంట్ చేశాడు.

ఇక ఈ వీడియో ప్రస్తుతం బాగా వైరల్ అవడంతో నెటిజన్స్ వారిపై దారుణంగా ట్రోల్స్, కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube