మరొకరి భార్యలను ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకునే వింత ఆచారం..ఈ ఆచారం వెనుక అసలు కథేంటో తెలుసా...  

Marry A Married Women Is A Ritual -

పరాయి మగవాడు తన భార్య వైపు కన్నెత్తి చూస్తే ఏ భర్త కైనా కోపం వస్తుంది , అలాంటిది ఏకంగా వారి భార్య లను ఎవడో పరాయి పురుషుడు ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది.వినడానికే అసహ్యంగా ఉంది కదూ… కానీ ఆఫ్రికా ఖండం లోని దక్షిణ దేశాలైన నైజీరియా , కెమరూన్ , చాడ్ వంటి దేశాల్లో ఉంటున్న ఒక తెగ లో ఇదే వారి ఆచారం , అసలు ఏమిటి వింత ఆచారం , ఈ ఆచారం వెనుక ఉన్న కథేంటో చూడండి…

Marry A Married Women Is A Ritual

ఆఫ్రికా ఖండం లోని నైజీరియా , చాడ్ , కెమెరూన్ దేశంలో నివాసిస్తున్న వదాబీ ఆమె తెగ ప్రజల వింత ఆచారాలు గురించి తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.

వదాబీ అనగా ” టబూ యొక్క ప్రజలు ” అని అర్థం .అక్కడి తెగ లో మగవారి కోసం ఒక ప్రత్యకమైన పండగ ప్రతి ఏడాది జరుపుకుంటారు.ఆ పండగానే యకి లేదా వైఫ్ స్టీలింగ్ ఫెస్టివల్ అంటారు.ఈ పండుగలో అక్కడి మగవాళ్ళు పెళ్ళైన అమ్మాయిలను దొంగిలించి వారిని పెళ్లి చేసుకోవాలి.ఆ తెగకు చెందిన అమ్మాయిలకు ఒకరి కంటే ఎక్కువ భర్తలు ఉంటారు.

మరొకరి భార్యలను ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకునే వింత ఆచారం..ఈ ఆచారం వెనుక అసలు కథేంటో తెలుసా…-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ పండగ వెనక అసలు కథవదాబీ తెగ ప్రజలు ఈ పండగ ఆచారాన్ని తమ పూర్వీకుల నుండి పాటిస్తున్నారు.ప్రతి ఏటా జరుపుకునే ఈ పండగ కోసం అక్కడి మగవాళ్ళు ప్రత్యేకమైన మేక్ అప్ వేసుకొని వారికి సంబంధించిన అభరలను ధరిస్తారు.పెదాలకి నల్లటి రంగుని వేసుకొని వారి పళ్ళు చీకట్లో స్పష్టంగా కనపడేలా తయారవుతారు.

ఈ పండగను రాత్రి పూట జరుపుకుంటారు.ఈ తెగ మగవారు అలా అలకరించుకున్న తరువాత అదే రోజు రాత్రి అక్కడి పెళ్ళైన స్త్రీ ల ముందు నృత్యాలు చేస్తారు.

అక్కడ ఉన్న అమ్మాయిలు వారికి నచ్చిన వారిని ఎంచుకుంటారు.

అయితే ప్రస్తుతం ఆ తెగ లో కొంత మంది మగవారు ఈ ఆచారాన్ని ఎదో సరదాకు జరుపుకుంటే , మరికొంత మంది మగవారు వారు కమించినా స్త్రీ ల కోసం చేస్తున్నారు.

అయితే కొంత మంది మగవారు ఆ పండగకి ఒకరోజు ముందే అక్కడి పెళ్ళైన స్త్రీ లతో ముందుగానే మాట్లాడుకొని ఆ నృత్యం చేసేటపుడు తమనే ఎంచుకోమని వేడుకుంటారట.ఇకపోతే పండగ అయిపోయాక మరుసటి రోజు ఆ మగవారి ఇంట్లో సంబరాలు జరుపుకుంటారు.

ఈ ఆచారాన్ని ఇప్పటికి వదాబీ తెగలో పాటిస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు