టిక్ టాక్ వీడియోలో భర్త ఆ రూపంలో ఉండటంతో...

ప్రతి పురుషుడులో స్త్రీ హార్మోన్స్ ప్రభావం ఉంటుంది.అలాగే స్త్రీలలో కూడా పురుష స్వభావాన్ని ప్రేరేమించే హార్మోన్స్ ఉంటాయి.

 Marriedmen Turnedas A Transgenderineast Godavari-TeluguStop.com

అయితే ఈ హార్మోన్స్ ప్రభావం సహజమైన స్వభావాన్ని డామినేట్ చేసినపుడు శరీరం ఒకలా, వ్యక్తిత్వం మరోలా ఉంటుంది.ఇలా ఉన్నవారిని థర్డ్ జెండర్ గా గుర్తిస్తారు.

అయితే ప్రతి వ్యక్తిలో ఇలాంటి హార్మోన్స్ ప్రభావం పుట్టుకతో ఉండదు.కొంత వయసు దాటాక హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ వలన కూడా మగాళ్ళలో ఆడవారి స్వభావం పెరిగిపోతుంది.

ఆడవాళ్ళలో ప్రవర్తిస్తూ ఉంటారు.అలాంటి వాళ్ళు ఎక్కువగా తరువాత సంసార జీవితంలో ఇమడలేక కుటుంబాలకి దూరంగా వెళ్ళిపోయి లింగ మార్పిడి చేసుకొని హిజ్రాలుగా మారిపోతారు.

ఇప్పుడు అలాంటి సంఘటన తూర్పు గోదావరి జిల్లా సీతానగరంలో నరిగింది.సీతానగరానికి చెందిన శివనారాయణ అనే వ్యక్తికి 12 ఏళ్ల క్రితం వివాహమైంది.అతడికి ముగ్గురు మగ పిల్లలు ఉన్నారు.ఐదేళ్లుగా హోటల్లో పనిచేస్తున్నానని చెప్పి రోజూ బయటకు వెళ్లి అతను ఇంటికి వస్తూ ఉండేవాడు.

అయితే గత కొంత కాలంగా కుటుంబానికి దూరంగా ఉంటున్న అతను హిజ్రా గెటప్ లో ఆడవారిలా చీర కట్టుకొని టిక్ టాక్ లో వీడియో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా అతని భార్య షాక్ కి గురైంది.భర్త ధవళేశ్వరంలో ఉంటున్నాడని తెలిసి భార్య, బంధువులు అతనిని తీసుకురావడానికి వెళ్ళారు.

అయితే అతను మాత్రం వారితో రావడానికి ఇష్టపడలేదు.దీంతో భార్య సీతానగరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

సీతానగరం పోలీస్‌ స్టేషన్‌లో అతడికి కౌన్సెలింగ్‌ ఇచ్చి కాపురానికి వెళ్లమని ఒప్పించే ప్రయత్నం చేసారు.అయితే తాను హిజ్రాగానే ఉంటానని తేల్చిచెప్పడంతో వారు ఏమీ చేయలేక ఇద్దరి మధ్య ఆస్తులకి సంబంధించి ఒప్పందం చేసారు.

ఇప్పుడు ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube