పెళ్లైన మహిళలు పొరపాటున కూడా ఈ వస్తువులను పుట్టింటి నుంచి అత్తింటికి తీసుకు వెళ్ళకూడదు?

సాధారణంగా పెళ్లి అయిన తర్వాత మహిళల తమ పుట్టింటి వారిపై ఎంతో ప్రేమానురాగాలను పెంచుకుంటారు.ఇక అత్తింటి నుంచి పుట్టింటికి వెళ్లాలంటే ఎంతో సంతోషిస్తున్నారు.

 Married Woman Should Not Carry These Items To The Fireplace, Married Womens, Car-TeluguStop.com

అదేవిధంగా పుట్టింటి నుంచి అత్తవారి ఇంటికి వెళ్లే సమయంలో వారి తల్లిదండ్రులు తమ కూతురికి కొన్ని వస్తువులను తన వెంట పంపిస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే పుట్టింటి నుంచి ఒక కొన్ని వస్తువులను తీసుకెళ్లడానికి మహిళలు కూడా ఎంతో ఇష్టత చూపుతుంటారు.

అయితే ఈ విధంగా పుట్టింటి నుంచి అత్తవారింటికి వస్తువులను తీసుకెళ్లేటప్పుడు పొరపాటున కొన్ని వస్తువులను అస్సలు తీసుకు వెళ్లకూడదని పండితులు చెబుతున్నారు.మరి ఆ వస్తువులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…

పెళ్లయిన తర్వాత మహిళలు పుట్టింటి నుంచి అత్తవారింటికి పొరపాటున కూడా పుల్లటి వస్తువులను, చేదు వస్తువులను తీసుకుపోకూడదు.

పుల్లటి వస్తువులను తీసుకోకపోవటం వల్ల ఇరు కుటుంబాల మధ్య మనస్పర్థలు తలెత్తాయి.అదేవిధంగా చేదు వస్తువులను తీసుకు వెళ్లడం వల్ల ఇరు కుటుంబాల మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి.

అదేవిధంగా పుట్టింటి నుంచి మహిళలు అత్తవారింటికి చీపురను తీసుకు వెళ్ళ కూడదు.ఈ విధంగా తీసుకోకపోవడం వల్ల పుట్టింటిలో ఉండే లక్ష్మిని తన వెంట తీసుకు పోతున్నట్లు అవుతుంది.

ఈ విధంగా చీపురు, ఉప్పు, చింతకాయ పచ్చడి వంటి వస్తువులను తీసుకువెళ్ళేటప్పుడు ఊరకనే కాకుండా పుట్టింటి వారికి కొంత డబ్బును చెల్లించి తీసుకు వెళ్ళవచ్చు.

అదేవిధంగా నల్లటి వస్త్రాలను కానీ, నల్లటి వస్తువులను కాని పుట్టి నుంచి తీసుకు వెళ్ళకూడదు.మరికొందరు తమ పుట్టింటి నుంచి గుర్తుగా కొన్ని పూజా సామాగ్రిని తీసుకొని వస్తారు.అయితే ఎలాంటి పరిస్థితులలో కూడా పుట్టింటి నుంచి పూజాసామాగ్రిని అత్తవారింటికి తీసుకు వెళ్ళకూడదని పెద్దలు చెబుతున్నారు.

కనుక పుట్టింటి నుంచి మహిళలు ఈ వస్తువులను ఎలాంటి పరిస్థితులలో తీసుకురాకూడదు.ఒకవేళ తీసుకువచ్చిన ఇరు కుటుంబాల మధ్య మనస్పర్థలు పెరుగుతాయని పండితులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube