భార్యను వదిలించుకోవాలని ఏకంగా ఆమెపై గ్యాంగ్ రేప్....  

Married Women Raped By Three People In Odisha-married Women Raped,married Women Raped News,odisha Crime News,odisha Latest News,odisha Local News

ప్రస్తుత సమాజంలో కొంతమంది ప్రేమలు అనురాగాలు, ఆప్యాయతలు కంటే డబ్బు, కామం, క్రోధం, వంటి వాటికి ఎక్కువగా విలువనిస్తూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.తాజాగా ఓ యువకుడు ఓ యువతిని ప్రేమించి పెద్దలను ఎదిరించి మరి పెళ్లి చేసుకొని చివరికి కట్నం తీసుకురాలేదని ఆమెను ఏకంగా తన స్నేహితులతో కలిసి గ్యాంగ్ రేప్ చేయించి వదిలించుకోవాలని అనుకున్నాడు.

Married Women Raped By Three People In Odisha-Married Married News Odisha Crime Latest Odisha Local

వివరాల్లోకి వెళితే ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి నవరంగపూర్ జిల్లాలలోని ఓ యువకుడు అదే ప్రాంతానికి చెందిన టువంటి ఓ యువతిని ప్రేమించాడు.ఇందులో భాగంగా ఆమెకి జీవితాంతం సంతోషంగా చూసుకుంటానని ఎటువంటి కష్టం రానివ్వని మాయమాటలు చెప్పి పెళ్ళికూడా చేసుకున్నాడు.

అయితే ఈ ప్రేమ పెళ్లికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో వారిద్దరూ యువకుడు ఇంట్లోనే ఉండేవారు.అయితే ఈ క్రమంలో తమ కోడలు కట్నకానుకలు ఏమి తీసుకు రానందున ఆమెకు తన అత్తమామలు సరైన గౌరవం ఇచ్చేవారు కాదు.

అంతేకాక ఎప్పుడూ సూటిపోటి మాటలతో వేధించే వాళ్ళు.దీంతో ఆమె కొద్ది రోజుల క్రితం తన భర్తతో కలిసి వేరు కాపురం పెట్టింది.

అయితే ఇది ఇలా ఉండగా ఈ నవదంపతులు వేరు కాపురం పెట్టిన తర్వాత కొంతమేర ఆర్థిక సమస్యలు ఉండడం మరియు కుటుంబ కలహాలు వంటి వాటితో విసిగిపోయిన అతడు వీటన్నిటికీ కారణం తన భార్య అని ఆమెను వదిలించుకునే ప్రయత్నాలు చేశాడు.ఈ క్రమంలో భర్త ప్రవర్తనపై అనుమానం వచ్చినటువంటి ఆ యువతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఇద్దరిని పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

అయినా కూడా అతడి బుద్ధి మారలేదు.దీంతో ఈసారి ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలంటే ప్రయత్నం చేశాడు.

ఇందులో భాగంగా తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పన్నాగం పన్నాడు.

ఇందులో భాగంగా ఆమెను పని నిమిత్తమై బయటకు తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేయించాడు.

దీంతో ఆమె ఒక్కసారిగా స్పృహ కోల్పోయింది.స్పృహ వచ్చిన అనంతరం ఆ యువతి నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి తనపై జరిగిన అన్యాయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఫిర్యాదు నమోదు చేసుకున్న టువంటి పోలీసులు విచారణ నిమిత్తమై భర్తనే అదుపులోకి తీసుకొని విచారించగా మిగిలిన నిందితుల కోసం కూడా వెతుకుతున్నారు.

తాజా వార్తలు

Married Women Raped By Three People In Odisha-married Women Raped,married Women Raped News,odisha Crime News,odisha Latest News,odisha Local News Related....