ఇంటి ఓనర్ భార్యతో ఎఫైర్ పెట్టుకున్న యువకుడు.. చివరికి...   

married women plan to kill her husband for Extra marital affair, Gowthami, married women, Extra marital affair, Crime news, Kama eddy District, Telangana, - Telugu Crime News, Extra Marital Affair, Gowthami, Kama Eddy District, Married Women, Married Women Plan To Kill Her Husband For Extra Marital Affair, Telangana

ఈ మధ్యకాలంలో కొందరు మహిళలు వివాహేతర సంబంధాల మోజులో పడి కట్టుకున్న భర్తను సైతం అంతమొందించడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. తాజాగా ఓ వివాహిత తన ఇంట్లో అద్దెకుంటున్న యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పరచుకుని చివరికి ప్రియుడిని తన భర్త పై ఉసిగొలిపి హత్య చేయించిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా పరిసర ప్రాంతంలో వెలుగు చూసింది.

TeluguStop.com - Married Women Plan To Kill Her Husband For Extra Marital Affair

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాలో గౌతమి అనే వివాహిత తన కుటుంబ సభ్యులతో నివాసముంటుంది.అయితే గౌతమి భర్త అప్పుడప్పుడు మద్యం సేవిస్తూ ఆమెను వేధించేవాడు.

దీంతో భర్త చేష్టలకు విసిగి పోయిన గౌతమి తన ఇంట్లో ఉన్న అద్దెకు ఉంటున్న ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.ఈ క్రమంలో ఈ విషయం గురించి తన భర్తకు తెలియడంతో పలుమార్లు గౌతమిని ఈ విషయం గురించి మందలించేవాడు.

TeluguStop.com - ఇంటి ఓనర్ భార్యతో ఎఫైర్ పెట్టుకున్న యువకుడు.. చివరికి… -General-Telugu-Telugu Tollywood Photo Image

అయినప్పటికీ గౌతమి తన భర్త మాటలను పెడచెవిన పెట్టడంతో ఇటీవలే ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది.దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన గౌతమి తన ప్రియుడితో తన భర్తని చంపించాలని పన్నాగం పన్నింది.

ఈ క్రమంలో తన భర్తని హత్య చేస్తే 15 వేల రూపాయలతో  డబ్బుతో పాటూ రెండు తులాల బంగారం కూడా ఇస్తానని తన ప్రియుడికి ఆశ చూపించింది.

దీంతో డబ్బు, బంగారానికి ఆశపడిన యువకుడు ఇంటి ఓనర్ ని అన్యాయంగా హత్య చేశాడు.

దీంతో ఈ విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని బంధువులు తెలిపిన వివరాల మేరకు దర్యాప్తు చేపట్టారు.ఈ దర్యాప్తు లో భాగంగా మృతుడి భార్య ను అదుపులోకి తీసుకొని విచారించగా తన భర్త వేధింపులు తాళలేక తానే తన ప్రియుడితో హత్య చేయించానని నేరం అంగీకరించింది.

దీంతో ప్రస్తుతం గౌతమితో పాటు డబ్బు బంగారానికి ఆశపడిన తన ప్రియుడు కూడా కటకటాల్లో ఊచలు లెక్కిస్తున్నారు.

#Married Women #ExtraMarital #MarriedWomen #Telangana #Gowthami

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు