కండోమ్ లేకుండా శృంగారం చేయనన్నందుకు...

ప్రస్తుత కాలంలో మనుషులు కామంతో కళ్ళు మూసుకుపోయి ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా జీవిస్తున్నారు.తాజాగా కండోమ్ లేకుండా శృంగారం చేయనందుకు మహిళ దారుణ హత్యకు గురైంది.

 Married Women Killed In Bangalore City-TeluguStop.com

ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరు ప్రాంతంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే ఓ మహిళ బెంగళూరు నగరంలో తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది.

అయితే వ్యక్తిగత కారణాలతో ఆ మహిళ తన భర్తకు దూరంగా ఉంటోంది.అందువల్ల తన కుటుంబ పోషణ నిమిత్తమై డబ్బులు కోసం వ్యభిచారం నిర్వహిస్తోంది.

అయితే ఈ క్రమంలో బెంగళూరులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నటువంటి ఓ వ్యక్తి  తన లైంగిక వాంఛ తీరిస్తే డబ్బులు ఇస్తానని చెప్పడంతో ఆమె అందుకు సరే అంది.దీంతో ఇద్దరూ కలిసి ఆ మహిళ నివాసం ఉంటున్నటువంటి ప్రాంతానికి వెళ్లారు.

అయితే ఈ క్రమంలో ఆమె కండోమ్ ధరించి ఉండగా అతడు కండోమ్ లేకుండా శృంగారం చేయాలని ఆమెతో అతడు వాదించాడు.అయితే కండోమ్ లేకుండా తన శృంగారం చేయలేనని ఆమె తెగేసి చెప్పింది.దీంతో కామంతో కళ్లు మూసుకుపోయి ఆగ్రహానికి గురైన టువంటి అతడు ఆమెను దారుణంగా హత్య చేశాడు.అనంతరం ఆమె ఇంట్లో ఉన్నటువంటి కొంత నగదు, బంగారం తీసుకొని పరారయ్యాడు.

అయితే ఇది గమనించిన టువంటి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు.

అలాగే ఇంతటి దారుణానికి ఒడిగట్టిన టువంటి నిందితుడి కోసం గాలించి సీసీ కెమెరాల రికార్డ్ అయిన ఫోటోలు ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసి విచారణ నిమిత్తమై రిమాండ్ కు తరలించారు.

#MarriedWomen #MarriedWomen #Married Women #BangaloreCrime #MarriedWomen

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు