వేధింపులు తట్టుకోలేక కోడలు ఏకంగా చపాతీ కర్రతో అత్తపై దాడి చేసి.. చివరికి

ఈ మధ్య కాలంలో కొందరు క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా కటకటాల పాలవుతున్నారు. కాగా తాజాగా ఓ వివాహిత తన అత్త పెట్టేటువంటి బాధలను భరించలేక అప్పడాల కర్రతో తలపై బాదడంతో అత్త అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

 Married Women Killed Her Mother In Law With Chapati Making Stick In Andhra Prade-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని గుంటూరు జిల్లా పరిసర ప్రాంతంలో ప్రియాంక అనే వివాహిత తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది.కాగా ఈ మధ్యకాలంలో ప్రియాంక తన అత్త ఇంటి కుటుంబ సభ్యుల నుంచీ వేధింపులు ఎదుర్కొంటోంది.

ఈ క్రమంలో పలుమార్లు ప్రియాంక కుటుంబ సభ్యులు తన అత్తమామలకు బాగా చూసుకోవాలని చెప్పి చూసినప్పటికీ తన మాత్రం ఎలాంటి మార్పు రాలేదు.దీంతో ఈ మధ్య కాలంలో ప్రియాంక కి అత్త వేధింపులు ఎక్కువయ్యాయి.

దీంతో మరోమారు ఈ విషయమై అత్తా కోడళ్ళు గొడవపడగా క్షణికావేశంలో ప్రియాంక చపాతీలు చేసే కర్ర తీసుకుని తన అత్తపై దాడి చేసింది.దీంతో తలకి గాయాలు బలంగా తగలడంతో బాధితురాలు అక్కడికక్కడే మృతి చెందింది.

Telugu Andhra Pradesh, Chapati Stick, Marriedmother, Mother-Telugu Crime News(�

ఇది గమనించిన స్థానికులు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించారు.అలాగే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించి బంధువులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.అంతేకాక ఈ విషయంపై పోలీసులు స్పందిస్తూ క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా ఇతరుల జీవితాలు ప్రమాదంలో పడుతాయని కాబట్టి ఏదైనా సమస్యలు గొడవలు ఉంటే కూర్చుని మాట్లాడుకుంటే సర్ధు మనుగుతాయని సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube