ఇన్సూరెన్స్ డబ్బు కోసం ప్రియుడితో కలసి భర్త ని హత్య చేయించిన భార్య...

ప్రస్తుత కాలంలో కొందరు వివాహేతర సంబంధాల మోజులో పడి పచ్చని కాపురాలను సైతం బుగ్గి పాలు చేసుకుంటున్నారు.తాజాగా ఓ వివాహిత తన ప్రియుడు మోజులో పడి ఏకంగా కట్టుకున్న భర్తనే కాటికి పంపించి చివరికి అతడిపై ఉన్నటువంటి ఇన్సూరెన్స్ డబ్బుని కాజేసుందుకు యత్నించిన ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది.

 Married Women Killed Her Husband For Insurance Money And Extra Marital Affair-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని వద్దె గూడెం పరిసర ప్రాంతంలో “మొండి శ్రీను” అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు అయితే మొండి శ్రీను తన కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా కాంట్రాక్టు పనులు మరియు వ్యాపారాలు చేసేవాడు.ఈ క్రమంలో ఇదే గ్రామానికి చెందిన పెంటయ్య అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది.

దీంతో పెంటయ్య అప్పుడప్పుడూ వచ్చి వెళుతూ వుండేవాడు.ఈ క్రమంలో పెంటయ్య శ్రీను భార్యతో చనువుగా ఉండేవాడు.

 Married Women Killed Her Husband For Insurance Money And Extra Marital Affair-ఇన్సూరెన్స్ డబ్బు కోసం ప్రియుడితో కలసి భర్త ని హత్య చేయించిన భార్య…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో శ్రీను ఇంట్లో లేనప్పుడు పెంటయ్య ఇంటికి వస్తూ శ్రీను భార్య ని బుట్టలో వేసుకున్నాడు.క్రమక్రమంగా పెంటయ్య పై మోజు పెంచుకున్న శ్రీను భార్య ఏకంగా తన భర్తని హతమార్చేందుకు కూడా సిద్ధమైంది.

Telugu Andhra Pradesh, Crime News, Extra Marital Affair, Insurance Money, Married Women Killed Her Husband, Married Women Killed Her Husband For Insurance Money And Extra Marital Affair-Telugu Crime News(క్రైమ్ వార్తలు)

దీనికితోడు ఇటీవల కాలంలో ఆర్థిక సమస్యలు కూడా రావడంతో కుటుంబ సభ్యులకు కొంతమేర డబ్బు అవసరమైంది.ఈ క్రమంలో పెంటయ్య మరియు శ్రీను భార్య వివాహేతర సంబంధం విషయం శ్రీను కి తెలిసింది.దీంతో శ్రీను ఇంట్లో తరచూ ఈ వివాహేతర సంబంధం విషయం గురించి గొడవలు జరిగేవి.ఈ క్రమంలో శ్రీను అప్పుడప్పుడు మద్యం సేవించి తన భార్యను చిత్రహింసలకు గురి చేసే వాడు దీంతో ఈ మధ్య ఈ చిత్రహింసలు ఎక్కువ ఉండడంతో శ్రీను భార్య తన భర్తని చంపేందుకు పన్నాగం పన్నింది.

ఈ క్రమంలో తన భర్తని మరియు పెంటయ్య పని నిమిత్తమై బయటకు పంపించి పెంటయ్య ద్వారా శ్రీను ని దారుణంగా హత్య చేయించింది అనంతరం హత్య సాధారణ మరణం చిత్రీకరించేందుకు ప్రయత్నాలు చేసింది.కానీ పోలీసుల విచారణలో శ్రీను భార్య పై అనుమానాలు కలగడంతో ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి.

#Extra #Insurance Money #Married #Andhra Pradesh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు