ప్రస్తుత కాలంలో కొందరు మహిళలు పెళ్లయిన తర్వాత వివాహేతర సంబంధాల మోజులో పడి కట్టుకున్న వారిని సైతం కడ తేర్చటానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు.తాజాగా ఓ వివాహిత పెళ్లై పిల్లలు ఉన్నప్పటికీ వరసకు బావ అయ్యే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరచుకొని చివరికి తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని కట్టుకున్న భర్తను కూడా దారుణంగా హత్య చేసి గోతిలో పాతి పెట్టిన ఘటన ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకు చెందినటువంటి కోడూరు అనే గ్రామంలో భవాని అనే వివాహిత తన భర్త, పిల్లలతో కలిసి నివాసముంటోంది.అయితే ఈ క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి సూర్యనారాయణ రెడ్డి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పరచుకుంది.
అయితే సూర్యనారాయణరెడ్డి భవానికి వరుసకు బావ అవుతాడు.ఈ మధ్యకాలంలో వీరిద్దరి వ్యవహారం శృతి మించిపోవడంతో భర్త అప్పుడప్పుడు భవాని ని ఈ వివాహేతర సంబంధం గురించి హెచ్చరిస్తూ ఉండేవాడు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు కూడా జరుగుతుండేవి.
దీంతో తాజాగా మరోమారు ఈ విషయంపై గొడవ జరగా జరగా భవాని మరియు సూర్యనారాయణ రెడ్డి ఇద్దరూ కలిసి భవాని భర్తను దారుణంగా హత్య చేసి తమ గ్రామానికి దూరంగా ఉన్నటువంటి ఓ ప్రాంతంలో మృతదేహాన్ని పాతిపెట్టారు.
దీంతో స్థానికులు ఇచ్చిన సమాచారం అందుకున్న టువంటి పోలీసులు మృతుడి భార్య నీ అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తన ప్రియుడితో కలిసి భర్త హత్య చేసినట్లు భవాని ఒప్పుకుంది.