భర్త నైట్ డ్యూటీ కి వెళ్ళగానే ఆంటీ ప్రియుడిని పిలిపించుకుని...

ప్రస్తుత కాలంలో కొందరు వివాహితలు వివాహేతర సంబంధాల మోజులోపడి పచ్చని కాపురాలను బుగ్గిపాలు చేసుకోవడమే గాకుండా చివరికి కట్టుకున్న వారి చేతులలో ప్రాణాలను సైతం కోల్పోతున్నారు.తాజాగా ఓ వివాహిత తన భర్త నైట్ డ్యూటీ కి వెళ్లడంతో తన ప్రియుడిని పిలిపించుకొని సరసాలాడుతూ కూతురు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని తండ్రికి చెప్పడంతో క్షణికావేశానికి లోనై అయినటువంటి ఆమె భర్త బలంగా కొట్టడంతో ప్రాణాలు విడిచిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.

 Married Women, Illegal Affair, Chennai, Crime News,-TeluguStop.com

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందిన వేలూరు పట్టణ పరిసర ప్రాంతంలో ఓ వ్యక్తి తన భార్యా పిల్లలతో కలిసి నివాసముంటున్నాడు.ఇతడు కుటుంబ పోషణ నిమిత్తం దగ్గరలో ఉన్నటువంటి ఓ ప్రైవేటు సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు.

ఇతడు నెలలోని వారాలు రాత్రి పగలు షిఫ్టుల్లో పని చేస్తున్నాడు.అయితే ఈ వ్యక్తి భార్య స్థానికంగా ఉన్నటువంటి  యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.ఇందులో భాగంగా భర్త నైట్ డ్యూటీ కి వెళ్ళిన సమయంలో ప్రియుడుని పిలిపించుకొని సరసాలు ఆడుతుండేది.ఈ క్రమంలో తాజాగా మరోమారు  వివాహిత భర్త పని నిమిత్తమై బయటకు వెళ్లడంతో వివాహిత తన ప్రియుడు ని పిలిపించుకొని సరసాలాడుతూ తన కన్న కూతురుకి ప్రత్యక్షంగా దొరికిపోయింది.

దీంతో వివాహిత కూతురు తన తల్లి అక్రమ సంబంధం గురించి తన తండ్రితో చెప్పడంతో క్షణికావేశానికి లోనై అయినటువంటి వివాహిత భర్త వివాహితపై కర్రతో బలంగా దాడి చేశాడు.అయితే ఈ దాడిలో వివాహితకు తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తమై దగ్గరలో ఉన్నటువంటి ఆస్పత్రికి తరలించే సమయంలో మృతి చెందింది.

స్థానికుల నుంచి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఫిర్యాదు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube