ఈ మధ్య కాలంలో కొందరు ప్రేమ, డబ్బు వ్యామోహంలో పడి కట్టుకున్న వారిని సైతం కడ తేర్చటానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు.కాగా ఓ వ్యక్తి కష్టపడి తన భార్యని చదివించగా భార్యకి ఉద్యోగం రావడంతో తనని చిన్న చూపు చూస్తూ తరచూ గొడవలు పడుతూ చివరికి తన మామని హత్య చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని మదనపల్లె పరిసర ప్రాంతంలో “వేణు గోపాల్” అనే వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు.అయితే వేణు గోపాల్ పెద్దగా చదువుకోకపోవడంతో స్థానికంగా దొరికే “పెయింట్ పనులు” చేస్తూ తన భార్య తులసమ్మ ని చదివించాడు.
అయితే అప్పటి వరకూ సాఫీగా సాగిపోతున్న సంసారం ఉన్నట్లుండి తులసమ్మకు ఉద్యోగం రావడంతో కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి.దీంతో తులసమ్మ తరచూ వేరే వ్యక్తితో ఫోన్ లో మాట్లాడుతూ వివాహేతర సంబంధం పెట్టుకుంది.
దీంతో ఇటీవలే ఈ విషయం వేణు గోపాల్ కి తెలియడంతో ఇంట్లో పెద్ద గొడవ జరిగింది.అంతేకాకుండా వేణు గోపాల్ కూడా పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించి తనకు న్యాయం చేయాలని కోరాడు.
ఈ క్రమంలో తులసమ్మ సోదరుడు, మరియు ఆమె బావ కూడా ఈ పంచాయతీలో పాల్గొన్నారు.అయితే పంచాయతీలో మాటామాట పెరిగి పెద్ద గొడవ జరిగింది.ఈ గొడవలో వేణు గోపాల్ తండ్రిపై తులసమ్మ మరియు ఆమె సోదరుడు, బావ తదితరులు బలంగా దాడి చేశారు.దీంతో వేణుగోపాల్ తండ్రి అక్కడికక్కడే మృతి చెందాడు.
అనంతరం స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని వేణు గోపాల్ తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకుని తులసమ్మ మరియు ఆమె సోదరుడు, బావ ను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.