ఈ మధ్య కాలంలో కొందరు డబ్బు మీద ఉన్నటువంటి మోజుతో అడ్డదారుల్లో సైతం డబ్బులు సంపాదించడానికి ఏమాత్రం వెనకాడటం లేదు.కాగా తాజాగా ఓ మహిళ ట్రైన్ లో వెళుతూ ఓ ప్రభుత్వ ఉద్యోగితో పరిచయం పెంచుకుని చివరికి అతడిని అడ్డం పెట్టుకుని ఇతరుల నుంచి దాపుగా 14 కోట్ల రూపాయలు” డబ్బులు వసూలు చేసి టోకరా పెట్టిన ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా పరిసర ప్రాంతంలో మౌనిక (పేరు మార్చాం) అనే మహిళ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటోంది.అయితే చిన్నప్పటినుంచి మౌనిక కి డబ్బు మీద వ్యామోహం ఎక్కువగా ఉండటంతో తన భర్త కష్టపడి సంపాదించిన డబ్బు తో చీటీల వ్యాపారం చేస్తూ డబ్బులు సంపాదించాలని ప్రయత్నాలు చేస్తోంది.
ఈ క్రమంలో ఎక్కువ వడ్డీ ఇస్తామని ఆశ చూపి మౌనిక నుంచి కొందరు డబ్బులు తీసుకుని తిరిగి చెల్లించకుండా ఎగ్గొట్టారు.దీంతో మౌనిక కుటుంబంలో తీవ్ర కలహాలు ఏర్పడ్డాయి.
ఈ క్రమంలో మౌనిక ఏకంగా భర్త నుంచి విడిపోయి వేరే కాపురం పెట్టింది.
దాంతో మౌనిక మళ్లీ ఎలాగైనా డబ్బు సంపాదించాలని కోరిక కలిగింది.
ఈ క్రమంలో పని నిమిత్తమై వేరే ఊరు వెళ్లి వస్తుండగా ట్రైన్ లో టిటిఐ గా పనిచేస్తున్న ఉద్యోగి తో పరిచయం ఏర్పడింది.దీంతో ఆ ఉద్యోగిని లైన్ లో పెట్టిన మౌనిక అతడికి శారీరక సుఖం ఆశ చూపించి తన ప్రియుడి ప్రభుత్వ ఉద్యోగాన్ని వాడుకుని దాదాపుగా 50 మందికి పైగా వ్యక్తులను మోసం చేసి 14 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.
అంతటితో ఆగకుండా ఈ డబ్బును తమ జల్సాల కోసం ఉపయోగించింది.ఈ క్రమంలో దాదాపు రెండు కోట్ల రూపాయల వరకూ పేకాటలో పెట్టి నష్ట పోయింది.
కొంతకాలం తర్వాత తమకు డబ్బులు ఇచ్చిన వ్యక్తులు తమ డబ్బు తిరిగి చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు.కానీ మౌనిక మాత్రం తనకేమీ సంబంధం లేనట్లు వ్యవహరించింది.అంతేకాకుండా అందరి ముందు తన ప్రియుడిని ఉంచుతూ తాను మాత్రం నిమిత్తమాత్రురాలు అన్నట్లు ప్రవర్తించింది.దాంతో కొందరు వ్యక్తులు మౌనిక ని కిడ్నాప్ చేసి పోలీసుల వద్దకు తీసుకెళ్లారు.
అంతేకాకుండా తమ డబ్బు తిరిగి ఇప్పించాలని పోలీసులను కోరారు.దీంతో ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ వుతోంది.
అంతేకాకుండా ఈ మధ్యకాలంలో కొందరు సులువుగా డబ్బు సంపాదించేందుకు వ్యాపారాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని కాబట్టి అలాంటి వారిని అస్సలు నమ్మవద్దని హెచ్చరిస్తున్నారు.అంతేకాకుండా ఇలా వ్యాపారాల పేరుతో ఎవరైనా మోసం చేస్తున్నట్లు అనుమానం వస్తే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించాలని సూచిస్తున్నారు.