బరి తెగించిన వివాహిత ఫేస్ బుక్ ప్రేమ మోజులో ఇనుప రాడ్లతో దారుణం     2018-05-09   03:30:47  IST  Raghu V

మూడుముళ్ల భందానికి..భారతీయ సాంప్రదాయ వ్యవస్థకి ఈ కాలంలో విలువలు తగ్గిపోతున్నాయి అనడడానికి ఈ సంఘటనే నిరద్సరం కేవలం ఫేస్ బుక్ లో పరిచయం అయిన వ్యక్తికోసం కట్టుకున్న భర్త మరణానికే పక్కా ప్లాన్ వేసిన ఈ భార్య చివరకి అనుకున్నది సాధించింది..తన భర్తని ఫేస్ బుక్ ప్రియుడితో హత్య చేయించింది..ఈ షాకింగ్ వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…

ఫేస్‌బుక్‌లో పరిచయం అయిన వ్యక్తితో సరస్వతి ప్రేమలో పడింది..అయితే ఈ ప్రేమ తన భర్తతో పెళ్లి కాకముందే జరిగింది..అయితే ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న తన మేనమామని అడ్డు తొలగించుకుని తన ప్రియుడితో కలిసి జీవితం పంచుకోవాలని అనుకుంది..అందుకు పక్కా ప్లాన్ కూడా రచించింది..అందుకోసం దాని కోసం ప్రియుడితో కలిసి గోపి, రామకృష్ణ అనే ఇద్దరు పాత నేరస్తులతో ఒప్పందం కుదుర్చుకుంది.