ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళానికి చెందిన దుర్గారావు అనే వ్యక్తి తన పెద్ద కూతురు అరుణకు 2009లో వివాహం చేశాడు.అతడి అల్లుడి పేరు సోమినాయుడు.
శ్రీకాకుళం వాసే.అంత సవ్యంగా ఉందని భావించారు.
ఇంతలో పెద్ద కూతురు ప్రెగ్నెంట్ అయింది.కానీ విధి ఆడిన వింత నాటకంలో పెద్ద కూతురు అరుణ డెలివరీ సమయంలో పండంటి బిడ్డకు జన్మనిచ్చి మృత్యువాత పడింది.
దీంతో ఏం చేయాలో తోచని దుర్గా రావు పుట్టిన చిన్న పాప బాగోగులు చూసుకోవడం కోసమని తన మూడో కూతురు ఉషారాణిని సోమినాయుడికి ఇచ్చి వివాహం జరిపించాడు.కానీ మూడో కూతురు ఉషా రాణి మాత్రం శవమై తిరిగొచ్చింది.
ఇదంతా అల్లుడు సోమినాయుడు వల్లే అని దుర్గారావు కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.అసలు ఏం జరిగిందంటే…
ఉషారాణిని ఇచ్చి వివాహం చేసిన తర్వాత సోమినాయుడు కొంత కాలం కడపలో ప్రైవేటు ఉద్యోగం చేశాడు.
కానీ ఉన్నట్టుండి 8 సంవత్సరాల క్రితం విజయనగరం జిల్లాకు వలస వచ్చాడు.అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఇనుప స్క్రాప్ మరియు కోళ్ల ఫారమ్ బిజినెస్ చేస్తూ ఉన్నాడు.
సోమినాయుడుకి ఉషారాణికి ఒక ఆడపిల్ల కూడా పుట్టింది.కానీ ఇలా వ్యాపారం చేస్తున్న సమయంలో సోమినాయుడి వక్ర బుద్ది బయట పడింది.
సోమినాయుడు వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.ఈ విషయం ఇల్లాలు అయిన ఉషా రాణికి తెలియడంతో వారి మధ్య తరుచూ గొడవలు జరుగుతూ ఉండేవి.
ఇటీవలి కాలంలో ఈ గొడవలు ముదిరాయి.దీంతో ఒకనాడు ఉషారాణి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.అది చూసిన సోమినాయుడు పోలీసులకు సమాచారం అందించకుండా, కనీసం పోస్టు మార్టం కూడా చేయించకుండా ఉషారాణి డెడ్ బాడీని తన ఫ్రెండ్స్ సాయంతో కిందికి దించి అత్తగారింటికి తీసుకెళ్లాడు.సోమినాయుడు ఇలా చేయడంతో దుర్గారావు తమ కూతురి చావుకు అల్లుడు సోమినాయుడే కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేస్తున్నారు.