ప్రస్తుత కాలంలో కొందరు కామ వాంఛలను అదుపులో పెట్టుకో లేకపోవడంతో పలు అనర్థాలకు దారితీస్తుంది.తాజాగా ఓ మహిళ భర్త చనిపోయి ఒంటరిగా ఉంటుండడంతో ఏకంగా తన కన్న కూతురు భర్తతో అక్రమ సంబంధం పెట్టుకొని కూతురు ప్రాణాలు తీసుకోవడానికి కారణమైన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే స్థానిక నగరంలోని మీర్ పేట్ ప్రాంతంతో ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి నివాసం ఉంటోంది.అయితే ఈ మహిళ కూతుర్లు ఇద్దరు చదువుకుంటున్నారు.ఈ క్రమంలో మహిళ భర్త చనిపోయి ఒంటరిగా ఉండటంతో తనకి లైంగిక వాంఛలు ఎక్కువయ్యాయి.దీంతో స్థానికంగా ఉన్నటువంటి ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.
అయితే ఈ క్రమంలో కొందరు చుట్టుపక్కలవారు ఆమె ప్రవర్తన గురించి పలు అభ్యంతరాలు చెప్పడంతో ఏకంగా తన వివాహేతర సంబంధం పెట్టుకున్నయువకుడిని తన పెద్ద కూతురుని పెళ్లి చేసుకునేందుకు ఒప్పించింది.
దీంతో అనుకున్న విధంగానే తన ప్రియుడితో తన కూతురు పెళ్లి చేసింది.దీంతో వీరిద్దరి బంధానికి అడ్డు అదుపు లేకుండా పోయింది.అయితే ఈ మధ్య కాలంలో వీరిద్దరి ప్రవర్తనపై అనుమానం వచ్చినటువంటి మహిళ కూతురు పలుమార్లు ఈ విషయంపై హెచ్చరించింది.
అయినప్పటికీ మహిళ మరియు తన భర్త వినిపించకపోవడంతో ఆత్మహత్యే శరణ్యం అనుకొని ఆత్మహత్య చేసుకుంది.దీంతో ఇదంతా గమనిస్తున్న మహిళ రెండవ కూతురు పోలీసులకి తన తల్లి మరియు బావ పై ఫిర్యాదు చేసింది.
అంతేకాక ఇందులో తన అక్క చనిపోవడానికి తన బావ మరియు తల్లి కారణమని స్టేట్ మెంట్ కూడా ఇచ్చింది.