భర్తను కాటికి పంపిన భార్య, ఆ తర్వాత బావతో బెడ్ రూమ్ లో.....

ప్రస్తుత కాలంలో కొందరు కామాంధకారంలో మునిగిపోయి తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగా ప్రాణాలను కోల్పోతున్నారు.కాగా తాజాగా ఓ వివాహిత పెళ్లి అయినా సరే తన బావపై ఉన్నటువంటి మోజు తీరకపోవడంతో వివాహేతర సంబంధం పెట్టుకొని చివరికి ఆ విషయం కాస్త తన భర్తకు తెలియడంతో భర్తని దారుణంగా హతమార్చి న ఘటన చత్తీస్ ఘడ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.

 Married Woman Brutally Killed Her Husband For Illegal Affair-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రంలోనే “బలరాంపూర్” జిల్లా పరిసర ప్రాంతంలో “స్వాతి (పేరు మార్చాం)” అనే వివాహిత తన కుటుంబ సభ్యులతో నివాసముంటోంది.కాగా స్వాతి భర్త కుటుంబ పోషణ నిమిత్తం స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.

అయితే ఇక్కడివరకు అంతా బాగానే ఉంది.కాగా స్వాతి మేన బావ గత కొద్దికాలంగా స్వాతి ఉంటున్న ప్రాంతంలోనే నివాసముంటున్నాడు.

 Married Woman Brutally Killed Her Husband For Illegal Affair-భర్తను కాటికి పంపిన భార్య, ఆ తర్వాత బావతో బెడ్ రూమ్ లో…..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో అప్పుడప్పుడు స్వాతి ఇంటికి తన బావ వచ్చి వెళుతూ వుండేవాడు.ఈ క్రమంలో బావతో స్వాతికి వివాహేతర సంబంధం ఏర్పడింది.

దీంతో స్వాతి తన భర్త ఇంట్లో లేనప్పుడు బావని పిలిపించుకుని ఎంజాయ్ చేసేది.

కాగా ఇటీవలే ఈ విషయం స్వాతి భర్తకు తెలియడంతో ఇద్దరిని నిలదీశాడు.అంతేకాకుండా మరోమారు తన ఇంటి ఛాయలకు వస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని స్వాతి బావ కి వార్నింగ్ ఇచ్చాడు.అయినప్పటికీ స్వాతి తన భర్త మాటలను పెడచెవిన పెట్టింది.

కాగా ఇటీవలే మరోమారు ఈ విషయంపై గొడవ జరగడంతో స్వాతి తన ప్రియుడిని పిలిపించుకుని భర్తని హతమార్చింది అనంతరం పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది.అయితే పోలీసుల విచారణలో స్వాతి ప్రవర్తన లో పలు మార్పులను గమనించారు.

దాంతో ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని తన బావతో కలిసి తానే హతమార్చినట్లు పోలీసుల ఎదుట నేరం అంగీకరించింది.

#MarriedWoman #MarriedWoman #Uttar Pradesh #Illegal Affair #Meerut

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు