దారుణం : కట్టుకున్న భార్య కట్నం తీసుకు రాలేదని భర్త స్నేహితులతో…  

married men rape attempt on his wife with his 3 friends in uttar pradesh Married women, Rape Attempt, Utter Pradesh, Crime news, - Telugu Crime News, Married Women, Rape Attempt, Utter Pradesh

ప్రస్తుత కాలంలో కొందరు డబ్బు కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతున్నారు.అంతేగాక ఈ డబ్బు మీద ఉన్న వ్యామోహంతో చివరికి కట్టుకున్న, తోడబుట్టిన, కడుపున పుట్టిన వారిని కూడా కడ తీర్చడానికి వెనకాడడం లేదు.

 Married Men Rape Attempt On His Wife With His 3 Friends In Uttar Pradesh

తాజాగా ఓ వ్యక్తి తన భార్య కట్నం తీసుకురాలేదని ఏకంగా ఆమెపై తన స్నేహితులతో కలిసి దారుణంగా అత్యాచారం చేయించిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందిన ఫిలిబిజిత్ ప్రాంతంలో ఇద్దరు భార్య భర్తలు నివాసముంటున్నారు.

దారుణం : కట్టుకున్న భార్య కట్నం తీసుకు రాలేదని భర్త స్నేహితులతో…-Latest News-Telugu Tollywood Photo Image

అయితే ఆమె భర్త తన కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా ఉన్నటువంటి అంబులెన్స్ సర్వీసు సంస్థలో పనిచేస్తుండేవాడు.అయితే తన భార్యని పెళ్లి చేసుకున్న సమయంలో భార్య తరపు బంధువులు ఇవ్వాల్సిన కట్న కానుకల విషయంలో కొంతమేర ఆలస్యం కావడంతో రోజూ తన భార్యను చిత్ర హింసలకు గురి చేస్తుండేవాడు.

అయితే ఈ మధ్య కాలంలో ఈ చిత్ర హింసలు ఎక్కువయ్యాయి.దీంతో వివాహిత తన కుటుంబ పెద్దలకు ఈ విషయం గురించి తెలియజేయడంతో వారు ఇద్దరికీ సర్దిచెప్పి పంపించారు.

అయితే  తాజాగా మరోమారు ఈ విషయం గురించి భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడ్డారు.భార్యపై కోపం పెంచుకున్న భర్త ఆమెను తన స్నేహితుల ద్వారా కిడ్నాప్ చేయించి దారుణంగా అత్యాచారం చేయించాడు.

దీంతో అపస్మారక స్థితిలోకి చేరుకున్న మహిళ ను చనిపోయిందనుకొని దగ్గరలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పై వదిలేసి వెళ్లారు.

అనంతరం మహిళ స్పృహలోకి రాగానే స్థానికుల సహాయంతో తన తల్లిదండ్రుల ఇంటికి చేరుకొని తనపై జరిగిన అఘాయిత్యం గురించి తెలిపిందే.

దీంతో ఆమెను వెంటబెట్టుకుని దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఈ విషయం గురించి ఫిర్యాదు చేయగా పోలీసులు మహిళ భర్తను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా తానే ఈ నేరం చేసినట్లు అంగీకరించాడు.

#Rape Attempt #Utter Pradesh #Married Women

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Married Men Rape Attempt On His Wife With His 3 Friends In Uttar Pradesh Related Telugu News,Photos/Pics,Images..