దారుణం : భార్య ఊరెళ్లిందని కన్న కూతురిపై తండ్రి దారుణంగా...

ఈ మధ్యకాలంలో కొందరు తాము కామాంధకారంలో మునిగిపోయి వావి వరుసలు మరచి ప్రవర్తిస్తుండడమే గాక  అభం శుభం తెలియని చిన్న పిల్లల జీవితాలను మొగ్గలోనే చిదిమెస్తున్నారు.తాజాగా కంటికి రెప్పలా పిల్లల్ని కాపాడుకోవాల్సిన  ఓ తండ్రి కామాంధుడు గా మారి తన భార్య ఊరు వెళ్ళడంతో కన్నకూతురిపై అత్యాచారం చేసిన ఘటన దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా కలకలం సృష్టించింది.

 Married Men Rape Attempt On His Daughter In Gujarat, Married Men, Crime News, Gu-TeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళితే గుజరాత్ పట్టణ పరిసర ప్రాంతంలో ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. అయితే ఇతడు కుటుంబ పోషణ నిమిత్తమై పట్టణంలోని చిన్నచిన్న పనులు మరియు వ్యాపారాలు చేస్తూ ఉండేవాడు.

 ఈ క్రమంలో ఈ వ్యక్తి భార్య పలు వ్యక్తిగత పనుల నిమిత్తమై తన సొంత ఊరికి వెళ్లడంతో గత వారం రోజులుగా 11 సంవత్సరాలు కలిగిన బాలిక మరియు ఆమె తండ్రి మాత్రమే ఇంట్లో ఉంటున్నారు.

ఈ క్రమంలో బాలిక తండ్రి తన కామ కోరికలను అదుపు చేసుకోలేక తన కన్న కూతురిపై కన్నేశాడు.

దీంతో బాలిక నిద్రపోతున్న సమయంలో బాలికపై లైంగికంగా దాడి చేసి దారుణంగా అత్యాచారం చేశాడు. అంతేగాక ఈ విషయం గురించి తన తల్లితో చెబితే చంపేస్తానని బెదిరించాడు.

Telugu Gujarat, Married, Marriedattempt, Attempt-Telugu Crime News(క్రై�

అయితే ఇటీవలే బాలిక తల్లి తన పనులు ముగించుకొని ఇంటికి రావడంతో బాలిక వ్యవహార శైలిలో కొంతమేర మార్పులని గమనించింది. దీంతో బాలికను ఏమైందని తల్లి నిలదీయగా తన కన్న తండ్రి చేసిన బాగోతం గురించి వివరించింది. దాంతో వెంటనే బాలికను వెంటబెట్టుకొని బాలిక తల్లి దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన భర్త పై ఫిర్యాదు చేసింది.బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే కసాయి తండ్రి ని అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube