ఫేస్ బుక్ లో ప్రేమించి... హైదరాబాద్ లో పెళ్లి చేసుకుని చివరికి...

ప్రస్తుత కాలంలో కొందరు ప్రేమ పేరుతో ఆడపిల్లల్ని లొంగతీసుకొని పెళ్లి చేసుకుని కొద్ది రోజులు కాపురం చేసి తమ కామ వాంఛలు తీర్చుకున్న తర్వాత మొహం చాటేస్తున్నారు.తాజాగాఓ యువకుడు సోషల్ మీడియా  మాధ్యమం అయినటువంటి ఫేస్ బుక్ లో యువతిని ప్రేమలోకి దింపి పెళ్లి చేసుకుని చివరికి యువతి వేరే సామాజిక వర్గానికి చెందిన మహిళ కావడంతో తన కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని మొహం చాటేసిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం లో జిల్లాలో చోటు చేసుకుంది.

 Married Men Cheat His Wife After Marriage In Anantapur-TeluguStop.com

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకే చెందినటువంటి నందవరం పరిసర ప్రాంతంలో రాకేష్ గౌడ్ అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు.అయితే ఇతడు ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించడంతో గత కొద్ది రోజులుగా ఇంటి పట్టునే ఉంటున్నాడు దీంతో సోషల్ మీడియా చాటింగ్ చేస్తూ కాలక్షేపం చేసేవాడు.

 అయితే ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరానికి చెందిన ఓ యువతితో పరిచయం సోషల్ మీడియా మాధ్యమం ఫేస్ బుక్ లో పరిచయం ఏర్పడింది.ఈ పరిచయం కాస్త కొద్ది రోజుల్లోనే ప్రేమ వైపు అడుగులు వేసింది.

 Married Men Cheat His Wife After Marriage In Anantapur-ఫేస్ బుక్ లో ప్రేమించి… హైదరాబాద్ లో పెళ్లి చేసుకుని చివరికి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో రాకేష్ గౌడ్ ఆమె కులం, మతం గోత్రం ఏమీ ఆలోచించకుండా హైదరాబాద్ కి వెళ్లి రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు.అంతేగాక 15 రోజులు కాపురం కూడా చేశారు.

 ఆ తరువాత రాకేష్ గౌడ్ తన కుటుంబ సభ్యులని కలిసేందుకు  తన స్వస్థలానికి వచ్చి ఇక తన భార్య సంగతి మర్చిపోయాడు.దీంతో తన భార్య ఫోన్ చేసినప్పటికీ సమాధానం ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చిన వివాహిత వెంటనే నందవరం కి వచ్చి రాకేష్ గౌడ్ ని నిలదీసింది.

దీంతో రాకేష్ గౌడ్ కుటుంబ సభ్యులు కూడా అతడు పెళ్లి చేసుకున్న యువతి తమ సామాజిక వర్గానికి చెందిన యువతి కాదని అందువల్లే ఈ ప్రేమ పెళ్లి ని అంగీకరించనట్లు తెలుస్తోంది.దీంతో యువతి చేసేదేమీలేక పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలంటూ వాపోయింది.

#Face Book Love #Hyderabad #Married #Anantapur

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు