కామంతో కళ్లు మూసుకుపోయి కొడుకు ప్రియురాలిపై...  

ప్రస్తుత కాలంలో కొందరు కామాంధకారంలో మునిగిపోయి వావీవరుసలు మరచి ప్రవర్థిస్తున్నారు.తాజాగా ఓ వ్యక్తి తన కొడుకు ప్రేమను అంగీకరించడం ఇష్టంలేక వారి ప్రేమను విడగొట్టేందుకు గాను కొడుకు ప్రేమించిన టువంటి యువతిపై దారుణంగా అత్యాచారం చేసిన ఘటన తమిళనాడు రాష్ట్రంలో వెలుగు చూసింది.

TeluguStop.com - Married Men Arrestedin Tamil Nadu

వివరాల్లోకి వెళితే నాగపట్టణం ప్రాంతంలో నిత్యానందం అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసం ఉంటున్నాడు.అయితే ఈ వ్యక్తి కొడుకు ముఖేష్ స్థానికంగా ఉన్నటువంటి ఓ యువతిని ప్రేమించాడు.

అంతేగాక వీళ్ళిద్దరికీ పెళ్లి చేయమని వారి ప్రేమ విషయాన్ని తమ తల్లిదండ్రులకి తెలిపారు.అయితే వీరి ప్రేమ వివాహానికి నిత్యానందం అంగీకరించలేదు.

అయితే ఈ విషయాన్ని తన కొడుకుకి తెలియకుండా దాచాడు.అంతేగాక ఎలాగైనా వాళ్ళిద్దరినీ విడగొట్టాలని పథకం పన్నాడు.

ఈ పథకంలో భాగంగా పెళ్లి విషయమై తనతో మాట్లాడాలని కొడుకు ప్రేమించినటువంటి యువతిని తన ఇంటికి పిలిచాడు.అనంతరం ఆమెను నిర్బంధించి ఆమెపై రెండు రోజుల పాటూ అత్యాచారం చేశాడు.అయితే నిత్యానంద నుంచి తప్పించుకున్నటువంటి ఆ యువతి తన స్నేహితుల సాయంతో నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి నిత్యానందంపై ఫిర్యాదు నమోదు చేసింది.కేసు నమోదు చేసుకున్న  పోలీసులు దర్యాప్తులో భాగంగా నిందితుడిని అరెస్టు చేసి విచారణ నిమిత్తమై రిమాండ్ కి తరలించారు.

#TamilNadu #Tamil Nadu News #MarriedMen #Married Men #Lovers

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు