కోరిక తీర్చకపోతే కొడుకుతో విడాకులిప్పిస్తానంటూ కోడలిపై...  

Married Men Arrested In Guntur - Telugu Girl Harassment News, Guntur Crime News, Guntur Latest News, Guntur Local News, Guntur News, Married Men Latest News, Married Men News

ప్రస్తుత కాలంలో కొందరు కామంతో కొట్టుమిట్టాడుతూ వావివరుసలు మరిచి ప్రవర్తిస్తున్నారు.ఇందులో భాగంగా కొత్తగా పెళ్లి అయ్యి ఇంటికి వచ్చిన కోడలిని కూతురులా చూసుకోవాల్సిన మామ ఆమె పై కన్నేశాడు.

Married Men Arrested In Guntur

అంతేగాక తరచూ తన కోరిక తీర్చాలంటూ వేధించసాగాడు.దీంతో మామ వేధింపులు రోజురోజుకి ఎక్కువవడంతో తట్టుకోలేక పోయిన ఆ యువతి పోలీసులను సంప్రదించిన  ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే జిల్లాలో స్థానికంగా ఉన్నటువంటి ఓ యువతికి అదే ప్రాంతంలో నివసించే టువంటి ఓ యువకుడితో వివాహం అయింది.అయితే ఇందులో భాగంగా యువకుడు తన ఉద్యోగ రీత్యా నిత్యం పలు ఇతర ప్రాంతాలకు వెళుతుంటాడు.

దీంతో అప్పుడప్పుడు యువతి ఒంటరిగా ఇంట్లో ఒక్కతే ఉంటుంది.అయితే ఆ సమయంలో తన భర్త తండ్రి అయినటువంటి మామ వచ్చి ఆమెను తన లైంగిక వాంఛను తీర్చాలంటూ ఇబ్బంది పెట్ట సాగాడు.

అంతేగాక ఒకవేళ తన కోరిక తీర్చుక పోతే తమ పచ్చని కాపురంలో నిప్పులు పోస్తానని లేనిపోని నిందలు మోపి ఇద్దరిని విడగొట్టి తన కొడుక్కి రెండో పెళ్లి చేస్తానని బెదిరించి సాగాడు.

దీంతో మామ మాటలకి భయపడిన  ఆ యువతి వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించింది.అంతేగాక తనపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న తన మామ పై ఫిర్యాదు చేసింది.దీంతో పోలీసులు విచారణ నిమిత్తమై నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.

తాజా వార్తలు