భార్య ఊరెళ్ళిందని ఆమె ఫ్రెండ్ ని ఇంటికి పిలిచి టీ లో మత్తు మందు కలిపి...

ఈ మధ్య కాలంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చట్టాలు, కఠిన శిక్షలు అమలు చేస్తున్నప్పటికీ మహిళలపై జరుగుతున్న అకృత్యాలను మాత్రం ఆగడం లేదు.అంతే కాకుండా కొందరు ఈ చట్టాలను బేఖాతరు చేస్తూ ప్రవర్తిస్తున్నారు.

 Married Man Rape Attempt On His Wife Friend-TeluguStop.com

కాగా తాజాగా ఓ వ్యక్తి తన భార్య ఊరు వెళ్ళిందని ఆమె స్నేహితురాలిని ఇంటికి పిలిచి దారుణంగా ఆమెపై అత్యాచారం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందిన మీరట్ పరిసర ప్రాంతంలో “రమ్య” అనే వివాహిత తన కుటుంబ సభ్యులతో నివాసముంటోంది.

 Married Man Rape Attempt On His Wife Friend-భార్య ఊరెళ్ళిందని ఆమె ఫ్రెండ్ ని ఇంటికి పిలిచి టీ లో మత్తు మందు కలిపి…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా రమ్య భర్త రామ్మోహన్ స్థానికంగా ఉన్నటువంటి ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.కాగా వ్యాయామం చేయడం కోసం రమ్య మరియు రామ్మోహన్ కలిసి ఉదయం సాయంత్రం వేళల్లో స్థానికంగా ఉన్నటువంటి ఓ పార్కుకి వెళ్లేవారు.

ఈ క్రమంలో “శిరీష” అనే యువతికి రమ్యతో పరిచయం ఏర్పడింది.దీంతో తరచూ శిరీష రమ్య ఫోన్ లో మాట్లాడుకోవడం, అప్పుడప్పుడు షాపింగ్ కు వెళ్ళడం వంటివి చేసేవాళ్ళు.

ఈ క్రమంలో రామ్మోహన్ కి శిరీష పై మోజు కలిగింది.

దీంతో రమ్య ఎప్పుడు బయటికి వెళుతుందా.? అని వెయిట్ చేసేవాడు.ఈ క్రమంలో తాజాగా రమ్య నిమిత్తమై తన పుట్టింటికి వెళ్ళింది.

దీంతో రామ్మోహన్ క్యాజువల్ గా శిరీష ని ఇంటికి పిలిచి ఆమె తాగే టీ లో మత్తుమందు కలిపి అత్యాచారం చేశాడు.అనంతరం వీడియోలు కూడా తీసి అడిగినప్పుడల్లా తన కోరిక తీర్చకపోతే ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరించ సాగాడు.

దీంతో శిరీష దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి వెళ్లి రామ్మోహన్ పై ఫిర్యాదు చేసింది.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రామ్మోహన్ ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం ఒప్పుకున్నాడు.

#RapeAttempt #MarriedMan #Married Men #Uttar Pradesh #Rape Attempt

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు