అత్తింటి వేధింపులకు బలైన అల్లుడు.. ఎక్కడంటే?  

Married Man Deceased by Wife Family, married man, deceased wife, mancherial, telangana - Telugu Deceased Wife, Mancherial, Married Man, Telangana

అదేంటి? అత్తింటి వేధింపులకు సాధారణంగా కోడళ్లు కదా బలయ్యేది.ఇక్కడ ఏంటి అల్లుడు బలయ్యాడు అని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్న.ఉద్యోగం లేదని అత్తింటి వారు చిన్న చూపు చూడటం, భార్య తరచూ గొడవ పడటం చెయ్యడం కారణంగా ఓ యువకుడు ఆత్మహత్య చేసుకొని మరణించాడు.

TeluguStop.com - Married Man Deceased Wife Family

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

TeluguStop.com - అత్తింటి వేధింపులకు బలైన అల్లుడు.. ఎక్కడంటే-General-Telugu-Telugu Tollywood Photo Image

తెలంగాణలోని కాగజ్‌నగర్‌కు చెందిన ఇగురపు చంద్రయ్య, సుందరి దంపతుల కుమారుడు దినేష్‌ మూడు సంవత్సరాల క్రితం జైపూర్‌ మండలం ఇందారానికి చెందిన అమల అనే అమ్మాయితో పెళ్లి జరిగింది.పెళ్లి జరిగిన సమయంలో సింగరేణిలో ఉద్యోగం పెట్టిస్తామని అమ్మాయి కుటుంబం చెప్పింది.

దీంతో ఉద్యోగం కోసం గత మూడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు.ఏళ్ళు గడిచిన ఉద్యోగం లేకపోవడంతో అతను జైపూర్‌ పవర్‌ప్లాంట్‌లో కాంట్రాక్టర్‌ వద్ద స్కిల్డ్‌వెల్డర్‌గా పని చేస్తున్నాడు.

దీంతో అత్తింటివారు ఆమెకు మర్యాద ఇవ్వకుండా సూటిపోటి మాటలతో అతన్ని హింసించారు.పైగా కట్టుకున్న భార్య సైతం అతనితో తరచూ గొడవ పడేది.

ఇంకా ఈ తరుణంలోనే వారం క్రితం భార్య అతనితో గొడవ పడి పుట్టింటికి వెళ్లిపోయింది.గురువారం దినేష్ రైలు పట్టాలపై విగత జీవిగా పడి ఉన్నాడు.అయితే అతని మృతిపై అతని తల్లితండ్రులు మాట్లాడుతూ అతను ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదని, కొడుకు మృతికి భార్య, అత్తమామలే కారణం అని వారు ఆరోపిస్తున్నారు.దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

#Deceased Wife #Married Man #Mancherial #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Married Man Deceased Wife Family Related Telugu News,Photos/Pics,Images..