భర్తకి మొదటి ర్యాంకు... భార్యకి రెండో ర్యాంకు

భార్య భర్తలు ఇద్దరు ఒకేలా చదవడం, ఒకే జాబ్ కి పోటీ పడటం చాలా అరుదుగా జరుగుతుంది.ప్రభుత్వ ఉద్యోగాలు ప్రయత్నం చేసేవారు చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలకి సిద్ధం అయిన వేర్వేరుగా చదువుతూ ఉంటారు.

 Married Couple Tops Chhattisgarh Public Service Commission Exam1-TeluguStop.com

ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ జంట పెళ్లి చేసుకున్న తర్వాత కలిసి చదువుకొని పోటీ పరీక్షలకు సిద్ధమయ్యారు.ఇక ఈ పోటీ పరీక్షలలో ఊహించని విధంగా భర్త మొదటి ర్యాంకు తెచ్చుకుంటే భార్య రెండో ర్యాంకు సొంతం చేసుకుంది.

ఇప్పుడు ఈ ఘటన ఆ రాష్ట్రంలో సంచలనంగా మారింది.

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు చెందిన అనుభవ్‌ సింగ్‌ ఆ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు ఎంపికవడమే లక్ష్యంగా చదివాడు.

ఇందుకోసం చదువు పూర్తవ్వగానే ప్రభుత్వ పరీక్షలకు సిద్ధం అవడం మొదలుపెట్టారు.ఇక పెళ్లి తర్వాత భార్య విభా సింగ్‌తో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు.ఇటీవల చీఫ్‌ మున్సిపల్‌ ఆఫీసర్‌ కు పరీక్ష నిర్వహించగా వీరు ఆ పరీక్ష రాసారు.తాజాగా ఈ పరీక్షకి సంబంధించిన రిజల్ట్ వచ్చింది.

ఈ ఫలితాల్లో వీరిద్దరూ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచారు.అనుభవ్‌కు 298.3744 మార్కులు రాగా.విభా సింగ్‌కు 283.9151 మార్కులు వచ్చాయి.ఊహించని విధంగా భార్య భర్తలు ఇద్దరికి ఒకటి, రెండు ర్యాంకులు రావడం ఇప్పుడు వీళ్ళిద్దరూ హాట్ టాపిక్ గా మారిపోయారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube