కరోనా ఎఫెక్ట్: విచిత్రంగా మాస్క్ లు కట్టుకొని మరీ పెళ్లి చేసుకున్న జంట

పెళ్లి అనేది ఎప్పటికీ ఒక మర్చిపోలేని అనుభూతిని కలిగిస్తుంది.పెళ్లి రోజున జరిగే తతంగం,బంధువులు అందరూ కూడా చాలా హడావుడి గా ఉంటూ ఒక వేడుకలా జరుగుతుంది.

 Marriage With Masks In Andhra Pradesh-TeluguStop.com

అందుకే ఈ మధుర జ్ఞాపకాలను పదికాలాల పాటు గుర్తు పెట్టుకోవాలని, అందరికి చూపించాలి అని ప్రతి ఒక్కరూ కూడా భావిస్తూ ఉంటారు.అందుకే వీడియో,ఫోటోలు అంతా హడావుడి ఉంటుంది.

అయితే అలాంటి పెళ్లి శుభకార్యమే తాజాగా ఆంధ్రప్రదేశ్ లో జరిగింది.అయితే ఈ పెళ్లి శుభకార్యంలో విశేషం ఏమిటంటే పెళ్లి కొడుకు,పెళ్లి కూతురు నుంచి ప్రతి ఒక్క బంధువు సైతం అందరూ కూడా కరోనా కారణంగా మాస్క్ లు ధరించి మరీ పెళ్లి వేడుక జరిపారు.

కరోనా ప్రపంచ వ్యాప్తంగా ఎంత కల్లోలం సృష్టిస్తుందో అందరికి తెలిసిందే.ఈ కరోనా వల్ల అసలు శుభకార్యాలను కూడా వాయిదా వేసుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తుండడం తో అందరూ కూడా తమ శుభకార్యాలను వాయిదా వేసుకుంటున్నారు.

కానీ పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం లో మాత్రం ఒక జంట పెళ్లి ని రద్దు చేసుకోకుండా ఇలా వినూత్నంగా అందరికి ఒక మెసేజ్ ఇద్దాం అన్నట్లుగా వరుడు,వధువు,పంతులుగారు,అతిధులు అందరూ కూడా మాస్కులు ధరించారు.పెళ్లికి వచ్చిన ప్రతీ ఒక్కరికీ కూడా మాస్కు ఇచ్చి తప్పనిసరిగా ధరించాలి అంటూ ఒక కండీషన్ కూడా పెట్టారు.

నిజానికి కరోనా వైరస్ సోకుతోంది కాబట్టి పెళ్లిళ్లు, శుభకార్యాలను వాయిదా వేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల ప్రభుత్వాలూ కోరుతున్నప్పటికీ ఈ పెళ్లికి సంబంధించి రెండు నెలల ముందే ముహూర్తం ఫిక్స్ చేయడం తో ఈ పెళ్ళికి సంబందించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుసుకున్నారు.దీనితో పెళ్లిని వాయిదా వేయడం ఇష్టం లేక అంతేకాకుండా ఈ పెళ్లిలో అందరూ మాస్కులు ధరించడం ద్వారా కరోనా వైరస్‌పై అందరికీ అవగాహన కల్పించినట్లు అవుతుందన్న ఒక మంచి ఆలోచన కూడా కలిసి ఈ పెళ్లిని చేయాలనీ నిర్ణయించుకున్నారు.

ఈ నిర్ణయాన్ని రెండు కుటుంబాల పెద్దలు కూడా ఒప్పుకోవడం తో పెద్ద సంఖ్యలో మాస్కులు కొన్నారు.

వచ్చిన వారందరికి కూడా మాస్క్ లు ఇచ్చిన కట్టుకోకుండా పెళ్లి వేడుకలో ఉండొద్దని సూచించడం తో ప్రతి ఒక్కరూ కూడా మాస్కులను ధరించే వధూవరులను ఆశీర్వదించారు.

మంచి ఉద్దేశంతో జరుగుతున్న పెళ్లి కావడంతో ప్రతీ ఒక్కరూ మాస్కులు ధరించారు.వారి పెళ్లికి సంబందించిన వీడియో,ఫోటోల్లో అందరూ కూడా మాస్కులు ధరించి మరి ఫోజులు ఇచ్చారు.

కరోనా ప్రభావం తో ఈ జంట తీసుకున్న నిర్ణయాన్ని డాక్టర్లు సైతం మెచ్చుకుంటున్నారు.ప్రజలందరూ కూడా ఇలాంటి ఒక అవేర్ నెస్ పెంచుకోవాలి అంటూ సూచిస్తున్నారు కూడా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube