నయనతారకు పెళ్లి అయిపోయిందా.. నిజమా..?  

Marriage rumours on Nayanthara and Vighnesh Shivan, Nayanthara, Vighnesh Shivan, Marriage rumors, Prabhudeva, Simbhu, Love - Telugu Love, Marriage Rumors, Marriage Rumours On Nayanthara And Vighnesh Shivan, Nayanatara, Nayanatara Marriage, Nayanthara, Prabhudeva, Simbhu, Vighnesh Shivan

సినీ రంగంలోకి నయనతార ఎంట్రీ ఇచ్చి 15 సంవత్సరాలు దాటింది.కోలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార పారితోషికం 5 కోట్ల రూపాయల కంటే ఎక్కువే కావడం గమనార్హం.

TeluguStop.com - Marriage Rumours On Nayanthara And Vighnesh Shivan

ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్లు ఎంతమంది వస్తున్నా నయనతార క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు సరికదా అంతకంతకూ పెరుగుతోంది.స్టార్ హీరోల సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా నటించి సినిమాసినిమాకు నయనతార తన రేంజ్ ను పెంచుకుంటోంది.

అయితే సినిమాలతో పాటు నయనతార ప్రేమ, పెళ్లి వ్యవహారాల్లోను పాపులర్ అవుతోంది.గత కొన్నేళ్లుగా దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ప్రేమలో ఉన్న నయనతారకు అతనితో పెళ్లైపోయిందని కోలీవుడ్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

TeluguStop.com - నయనతారకు పెళ్లి అయిపోయిందా.. నిజమా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

కోలీవుడ్ లోని ఒక మీడియా సంస్థ వీళ్లిద్దరి పెళ్లి ఇప్పటికే జరిగిపోయిందని జోరుగా కథనాలు ప్రచారం చేస్తోంది.నయనతార, విఘ్నేష్ శివన్ స్పందిస్తే మాత్రమే వీళ్ల పెళ్లి వార్త నిజమో కాదో తెలిసే అవకాశం ఉంది.
నిజానికి గతంలోనే నయనతార ఇద్దరు సెలబ్రిటీలతో ప్రేమాయణం సాగించి వివధ కారణాల వల్ల విడిపోయింది.మొదట శింబుతో ప్రేమాయణం సాగించిన నయన్ ఆ తర్వాత ప్రభుదేవాను ప్రేమించింది.

ప్రభుదేవాతో విడిపోయిన తరువాత కొంతకాలం సైలెంట్ అయిన నయన్ విఘ్నేష్ శివన్ తో ముచ్చటగా మూడోసారి లవ్ లో పడింది.వీళ్లిద్దరూ ఇప్పటికే డేటింగ్ లో ఉండగా నయన్ పెళ్లి వార్త నిజమో కాదో తెలియాల్సి ఉంది.
మరోవైపు నయనతారతో పాటు హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన వారిలో ఒకరిద్దరు మినహా అందరికీ పెళ్లిళ్లు అయ్యాయి.ప్రస్తుతం నయనతార వయస్సు 35 సంవత్సరాలు.

ఇప్పటికీ నయనతార గ్లామరస్ గానే కనిపిస్తున్నప్పటికీ ఆమె వయస్సు మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.మరి నయనతార నిజంగా విఘ్నేష్ శివన్ ను పెళ్లి చేసుకుందో లేదో తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే.

#Simbhu #Love #Marriage Rumors #Vighnesh Shivan #Nayanatara

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Marriage Rumours On Nayanthara And Vighnesh Shivan Related Telugu News,Photos/Pics,Images..