వైరల్: పెళ్లి పీటలపైనే లిప్‌కిస్ పెట్టుకోమన్న పూజారి..!

పెళ్లి అంటే చాలు మన పెద్దవాళ్ళు చేసే హడావుడి అంతా ఇంతా కాదు.పెళ్లి అంటేనే ఆ వధువరుల ఇంట్లో సంబరాలు మొదలయిపోతాయి.

 Marriage Priest Asked Couples To Lip Kiss Infront Of All Details, Viral News, Vi-TeluguStop.com

ఎందుకంటే ఎవరి జీవితంలో అయిన పెళ్లి అనేది ఒక మధుర జ్ఞాపకంలాగా ఉండిపోవాలి అని ఇరు కుటుంబ సభ్యులు ఆ జంట పెళ్లి వేడుకను అంగరంగ వైభవంగా జరిపిస్తారు.అలాగే పెళ్లి వేడుకని కూడా మన సంప్రదాయాలను, ఆచారాలను తూచా తప్పకుండా పాటిస్తూ ఉంటారు.

జీలకర్ర-బెల్లం దగ్గర నుండి, వరుడు వధువుకు తాళి కట్టే సమయం వరకు అన్ని కూడా ఒక సమయం ప్రకారం వేద మంత్రాల సాక్షిగా చేస్తారు.

ఆ తరువాత భార్య భర్తలు ఇద్దరూ చిటికెన వేలు పట్టుకుని ఏడడుగులు నడిచి, అరుంధతి నక్షత్రం చూసి, అప్పగింతలు అయ్యే వరకు ప్రతిదీ కూడా ఒక సాంప్రదాయ పద్దతిలో ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ వస్తారు.

ఎన్ని శతాబ్దాలు మారిన కానీ మన ఆచారంలో ఉండే ప్రతి ఘట్టం కూడా ఒక ప్రత్యేకతగా నిలిచిపోతుంది.ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక పెళ్లి వేడుకలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది.

స్వయంగా దగ్గర ఉండి పూజారే ఇలా చేయమనడం ఏంటి అని అందరు ఆశ్చర్యపోతున్నారు.

ఇంతకీ ఆ పూజారి ఏమి చేసాడంటే పెళ్ళికి వచ్చిన బంధువులు అందరు చూస్తుండగానే పూజారి ఆ నూతన వధూవరులను ముద్దుపెట్టుకోమని చెప్పాడు.

Telugu Groom, Infront, Lip, Priest, Latest-Latest News - Telugu

పూజారి చెప్పినట్లే ఆ నూతన వధూవరులు బహిరంగంగానే ఒకరినొకరు లిప్ టూ లిప్ కిస్ పెట్టుకున్నారు.అంతేకాకుండా ఈ ఆలోచన గురించి పూజారికి చెప్పింది మరెవరో కాదు స్వయంగా ఆ పెళ్లికొడుకు తండ్రే.అతను పూజారికి చెప్పడంతో ఆ పూజారి కొత్త జంటకు అలా చేయమని సూచించాడు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది.అయితే ఈ వీడియో పట్ల నెటిజన్లు నుంచి మిశ్రమ స్పందన రావడం విశేషం అనే చెప్పాలి.కొంతమంది హిందూ సంప్రదాయాలను అవమానిస్తున్నారని, కాసేపు ఆగితే ఫస్ట్ నైట్ కూడా చేసుకోమంటారని మండిపడుతుంటే మరికొందరు మాత్రం ఈ వీడియో చూడడానికి చూడముచ్చటగా ఉందని కామెంట్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube