కేరళ అమ్మాయి తమిళనాడు అబ్బాయి నడిరోడ్డుపై పెళ్లి..!

ప్రతి మనిషికి పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారి మాత్రమే వచ్చే అరుదైన సందర్భం.దీనికోసం ఆ యువకుడు యువతి అనేక కలలు కనే ఉంటారు.

 Marriage Has Done At Tamilnadu Kerala Border Only,tamiladu Boy,kerala Girl,marri-TeluguStop.com

ఎంతో అంగరంగ వైభవంగా సంతోషంగా పదిమంది పెద్దల నడుమ వారి పెళ్లి చేసుకోవాలని చాలా మంది భావిస్తారు.అయితే ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కారణంగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

లాక్ డౌన్ మొదలు అవ్వకముందు నిశ్చయించిన చాలా వివాహాలు నిరాడంబరంగా కొనసాగుతున్నాయి.కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కేవలం 20 నుంచి 50 మంది మాత్రమే పెళ్లికి అనుమతిస్తూ వారి వివాహాలను చాలా నిరాడంబరంగా కొనసాగిస్తున్నారు.

ఇకపోతే తాజాగా తమిళనాడు కేరళ సరిహద్దుల్లో నడిరోడ్డుపై వివాహం జరిగింది.

పూర్తి వివరాల్లోకి వెళితే రెండు రాష్ట్రాల సరిహద్దు వద్ద వారు వివాహం చేసుకున్నారు.

తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్ కు చెందిన వరుడు రాబిన్ సన్ కేరళ రాష్ట్రానికి వచ్చేందుకు ఈపాస్ లభించక పోవడంతో వారు నడిరోడ్డుపైనే వివాహం నిరాడంబరంగా జరుపుకున్నారు.ఇకపోతే అతను పెళ్లి చేసుకున్న అమ్మాయి ప్రియాంక కేరళ రాష్ట్రానికి చెందిన ఇడుక్కి జిల్లా పాలమెనూర్ కు చెందిన అమ్మాయి.

కాకపోతే మున్నూరు లో ఉన్న సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో మార్చి 22న వివాహం జరగాల్సి ఉండగా అధికార లాక్ డౌన్ కారణంగా వివాహం ఆగిపోయింది.ఇక పోతే ఈ వివాహం ఆదివారం ఉదయం సుబ్రమణ్యస్వామి ఆలయంలోనే జరిపించేందుకు వారు తీర్మానించుకున్నారు.

ఈ నేపథ్యంలో పెళ్లి కుమారుడు కుటుంబంకి ఈపాస్ లభించలేదు.ఇకపోతే దీనివల్ల ఆదివారం ఉదయం వరల్డ్ కుటుంబీకులు రెండు రాష్ట్రాల సరిహద్దు చేరుకొని అక్కడ ఉన్న ఆరోగ్య శాఖ అధికారులు, పోలీసుల సమక్షంలో అమ్మాయి ఇంటి వారి తరఫున వచ్చిన దేవికుళం మాజీ ఎమ్మెల్యే మనీ వరుడికి తాళిబొట్టు అందజేశారు.

దీనితో వరుడు రాబిన్ సన్ వధువు ప్రియాంక మెడలో తాళి కట్టి వివాహం చేసుకున్నారు.ఇక దీంతో వధువు కు తమిళనాడు కు వెళ్లేందుకు ఈపాస్ లభించలేదు.

ఆ తర్వాత వధువు వరుడుతో పాటు కోవైశరణంపట్టి కి తీసుకు వెళ్లారు.చివరగా పెళ్ళికొడుకు ఇంట్లోనే వధువుకు 14 రోజులపాటు క్వారంటైన్ లోనే ఉండాలని అధికారులు పెళ్లికూతురుకి సూచించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube