సూపర్‌ మచ్చి : వరుడి స్నేహితుడు చేసిన పనితో పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకున్న పెళ్లి కూతురు  

Marriage Canceled In Bengaluru Because Of Groom Friend Misbehavior - Telugu Bengaluru, Groom Friend Misbehavior, Lokaditya, Marriage Canceled, పెళ్లి కూతురు

పీఠల మీద పెళ్లి ఆగిపోయింది అంటూ మనం చాలా సార్లు వార్తల్లో చూశాం, విన్నాం.అయితే పీఠల మీద పెళ్లి ఆగిపోవడానికి కొన్ని సార్లు కారణాలు చిత్రంగా.

Marriage Canceled In Bengaluru Because Of Groom Friend Misbehavior - Telugu Lokaditya పెళ్లి కూతురు

విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి.ఇటీవల బెంగళూరు సమీపంలో ఒక పెళ్లి క్యాన్సిల్‌ అయ్యింది.

ఆ పెళ్లి క్యాన్సిల్‌కు కారణం పెళ్లి కూతురు కాదు, పెళ్లి కొడుకు కాదు.పెళ్లికి వెళ్లిన వరుడి స్నేహితులు.

అతడి స్నేహితుల ప్రవర్తన చూసి వరుడి ప్రవర్తనపై అవగాహణకు వచ్చిన పెళ్లి కూతురు బాబోయ్‌ నీకో దండంరా బాబు, నీ స్నేహితులే ఇలా ఉంటే నీవు ఎలా ఉంటావో నాకు వద్దు నీవు అంటూ పీఠల మీద పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకోవడంతో చర్చనీయాంశం అయ్యింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… లోకాదిత్యకు అమృతాచోలికి పెళ్లి ఫిక్స్‌ అయ్యింది.

ఇరు కుటుంబాలు అన్ని విషయాలను మాట్లాడుకుని పెళ్లి ఫిక్స్‌ చేశారు.అమ్మాయి, అబ్బాయి ఇష్టపడటంతో పాటు ఇద్దరు పెళ్లికి ముందు బాగానే మాట్లాడుకునే వారట.

వారు ఎదురు చూసిన పెళ్లి రోజు రానే వచ్చింది.పెళ్లి హడావుడి అంతా ఉంది.

పెళ్లికి ఒక వైపు ఏర్పాట్లు చేస్తుండగా మరో వైపు పెళ్లి కోసం అంటూ వచ్చిన లోకాదిత్య స్నేహితుడు ఒకడు అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడట.ఆ అమ్మాయి కాస్త సీరియస్‌ అవ్వడంతో గొడవ పెరిగి పెద్దదయ్యింది.

ఆ గొడవలో అమ్మాయిని ఏడిపించిన స్నేహితుడికి బుద్ది చెప్పి క్షమాపణ చెప్పాల్సింది పోయి స్నేహితుడిని వెనకేసుకు రావడంతో పాటు ఆ అమ్మాయిపై అసభ్యంగా మాట్లాడాడు.పెళ్లి కొడుకు తీరుకు అంతా అవాక్కయ్యారు.తప్పు చేసిన స్నేహితుడిని అంతగా వెనకేసుకు వస్తున్నాడు ఏంటీ అంటూ చెవులు కొరుకున్నారు.పెళ్లి కొడుకు తీరు పెళ్లి కూతురు కూడా నచ్చలేదు.అతడి స్నేహితుడికి ఇంతగా సపోర్ట్‌ చేస్తున్నాడు అంటే ఇతడు ఎంతటి రసికుడో కదా అంటూ ఆమె అనుమానం వ్యక్తం చేసింది.తల్లిదండ్రులతో చెప్పి పెళ్లి క్యాన్సిల్‌ చేయించుకుంది.

ఈ విషయం కాస్త స్థానికంగా వైరల్‌ అయ్యింది.

తాజా వార్తలు