వాడి పెళ్లి బందువుల చావుకు వచ్చింది... ఇదెక్కడి పెళ్లిన బాబు అనుకున్న బంధువులు  

Marriage Baarat In Snowfall In Chamba Himachal-

ఇండియాలో పెళ్లిల్లు పక్కా ముహూర్తాలకు జరగాలని పెద్దలు పట్టుబడుతూ ఉంటారు.పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి పెళ్లిలు జరిగితేనే ఆ జంట సంతోషంగా ఉంటారనేది పండితుల మాట.అందుకే ఇండియాలో పెళ్లిలు పక్కా ముహూర్తాలు నిర్ణయించి, తిధి, నక్షత్రాలు చూసి మరీ నిర్ణయిస్తారు.

Marriage Baarat In Snowfall In Chamba Himachal--Marriage Baarat In Snowfall Chamba Himachal-

ఆ సమయానికి ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి జరగాల్సిందే.ముహూర్తం సమయానికి కనీసం పెళ్లి పీఠలపై కూర్చోబెట్టి మనవద్దనైతే జీలకర్ర బెల్లం అయినా పెట్టిస్తారు.తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం అంతటా కూడా పెళ్లిలు చాలా పద్దతిగా, ముహూర్తాల ప్రకారం జరుగుతూ ఉంటాయి.

Marriage Baarat In Snowfall In Chamba Himachal--Marriage Baarat In Snowfall Chamba Himachal-

తాజాగా ఉత్తరాఖండ్‌లోని రుద్ర ప్రయాగ్‌కు చెందిన వరుడు రజనీష్‌ కూర్మాచారి పెళ్లికి సిద్దం అయ్యాడు.పెళ్లికి అంతా సిద్దం అయ్యింది.పెళ్లికి ఫంక్షన్‌ హాల్‌ అంతా సిద్దం చేశారు.అటు వైపు నుండి అమ్మాయి, ఆమె తరపు బందువులు ఫంక్షన్‌ హాల్‌కు చేరుకున్నారు.

అయితే రజనీష్‌ కూర్మాచారి కూడా పెళ్లికి బందువులతో కార్లలో బయలుజేరాడు.అయితే మంచు తుఫాన్‌ రావడంతో మంచు బాగా పేరుకు పోయి కార్లు ముందుకు వెళ్లే పరిస్థితి లేదు.దాంతో అలా అని వెనక్కు కూడా వెళ్లలేని పరిస్థితి ఫంక్షన్‌ హాల్‌కు వెళ్లాలి అంటే ఆరు కిలోమీటర్లు, వెనక్కు ఇంటికి వెళ్లాలి అంటే 10 కిలోమీటర్లు.

ఇలాంటి పరిస్థితుల్లో కూర్మాచారి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.తనతో ఉన్న 80 మంది బంధులను కార్లు దించి నడుస్తూ వెళ్దాం అంటూ ఒప్పించాడు.ఆరు కిలో మీటర్లు మంచు తుఫాన్‌లో వెళ్లడం మామూలు విషయం కాదు.ఒక ఇంటి నుండి మరో ఇంటికి వెళ్లేందుకే అక్కడి వారు భయపడతారు.అలాంటిది పెళ్లి కోసం ఏకంగా ఆరు కిలోమీటర్లు నడిపించారు.

మంచు లో ఇబ్బంది పడుతూ వరుడి తల్లిదండ్రులు మరియు బంధువులు ఎదోలా ఫంక్షన్‌ హాల్‌కు చేరుకున్నారు.దాంతో ముహూర్తం సమయానికి అక్కడకు వెళ్లారు.కొందరి ఆరోగ్యం చెడిపోయిందని, అయినా కూడా పెళ్లి సమయానికి జరిగినందుకు సంతోషం అంటూ వారు చెబుతున్నారట.

కొందరు మాత్రం వాడి పెళ్లి మా చావుకు వచ్చింది బాబోయ్‌ అంటూ బెంబేలెత్తుతున్నారు.