అయ్యయ్యో: ఒకవైపు పెళ్లి.. మరోవైపు ఆఫీస్ పని చేస్తున్న వరుడు..!

కరోనా కష్టకాలంలో అనేక శుభకార్యాలు ఆగిపోయాయి.కొన్ని వాయిదా పడ్డాయి.

 Marriage At One Side And Office Work At Other Groom Troubling In Wedding-TeluguStop.com

ఇప్పుడిప్పుడే కేసులు తగ్గుతుండటం వలన మళ్లీ పెళ్లిపందిరులు కళకళలాడుతున్నాయి.అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల శుభకార్యాల సమయంలో ఉద్యోగాలు చేస్తున్నవారు అవస్థలు పడాల్సి వస్తోంది.

తాజాగా అలాంటి ఓ ఘటనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇప్పుడున్న పరిస్థితులలో ఈ శుభకార్యాలు కూడా అతి తక్కువ మంది బంధువుల సమక్షంలో జరుగుతున్నాయి.

 Marriage At One Side And Office Work At Other Groom Troubling In Wedding-అయ్యయ్యో: ఒకవైపు పెళ్లి.. మరోవైపు ఆఫీస్ పని చేస్తున్న వరుడు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అనేక పెళ్లిళ్లు నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు.వాటిలో జరిగిన కొన్ని విచిత్ర, ఆశ్చర్యపరిచే సంఘటనలు సోషల్ మీడియాలో దర్శనమిస్తూ ఆకట్టుకుంటున్నాయి.

పెళ్లి టైంలో పెళ్లికొడుకు, పెళ్లి కూతురు వేసే స్టెప్పులు చూస్తే తెగ ముచ్చటేస్తున్నాయి.పెళ్లికొచ్చిన కుటుంబీకుల తమాషా వీడియోలు అయితే తెగ నవ్వును తెప్పిస్తున్నాయి.

తాజాగా ఒక పెళ్లికొడుకు పెళ్లి మండపంలో చేసిన పని అందర్నీ ముక్కుమీద వేలేసుకునేలా చేసింది.ఇంతకీ ఆ సంగతి ఏంటంటే.

ఓ ప్రదేశంలో పెళ్లి నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు.పెళ్లి వాతావరణం అంతా కూడా చాలా అందంగా డెకరేట్ చేశారు.

ఆ పెళ్లికొచ్చినవారు అందరూ కూడా ఏదో ఒక పని చేసుకుంటూ హడావుడిగా గడుపుతున్నారు.పెళ్లికొడుకు కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు.

ఈ సమయంలోనే పెళ్లికొడుకు మండపంలో కూర్చొని ల్యాప్ టాప్ పట్టుకుని ఏదో పని చేసుకుంటూ ఉన్నాడు.

కొంత టైమ్ అయిపోయాక తన ల్యాప్ టాప్ ను తన పక్కవారికి ఇచ్చాడు.

ఆ తర్వాత తన కుటుంబ సభ్యుల వద్దకు వచ్చాడు.ఇక పెళ్లి ఆఖరి ఘట్టం ప్రారంభించారు.ప్రస్తుతం పెళ్లికొడుకు వీడియో సోషల్ మీడియోలో హల్ చల్ చేస్తోంది.ఇన్స్ట్రాగ్రామ్ లో ఈ వీడియో పోస్టు అయ్యింది.కరోనా కారణంగా అనేక కంపెనీలు తమ సిబ్బందిని ఇంటి నుంచే పనిచేసుకునే అవకాశాన్ని కల్పించాయి.వర్క్ ఫ్రం హోమ్ అనేది ఇప్పుడు ఉద్యోగుల జీవితాల్లో ఓ భాగం అయిపోయింది.

అయితే ఇంట్లో పనులు చూసుకుంటూనే చాలా మంది తమ ఆఫీసు వర్క్ కూడా చేసుకుంటూ పోతున్నారు.ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రం వెడ్డింగ్ అనేలా ఓ ఉద్యోగి ఏకంగా పెళ్లి మంటంపై ల్యాప్ టాప్ తో వర్క్ చేశాడు.

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

#MarriageAt #Social Meida #GroomLaptap #Office Work #Viral Video

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు