ఆ ప్రాంతంలో ఆడపిల్ల పుడితే రూ.10 వేల బహుమానం..!

ఆడపిల్లల పట్ల వివక్షత అనేది ఎక్కడో ఒకచోట చూపిస్తూనే ఉన్నారు.మన దేశం ఎంత అభివృద్ధి చెందుతున్నాగాని గర్భంలో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలిస్తే అబార్షన్ చేపించేస్తున్నారు.

 Mariyapuram Village Sarpanch Announced Ten Thousand Rupees If A Girl Is Born Det-TeluguStop.com

ఈ ఆధునిక కాలంలో ఆడవాళ్లు వంట ఇంటికే పరిమితం కాకుండా అన్నీ రంగాలలోను రాణిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆడపిల్లను భారంగా భావించే తల్లి తండ్రులు అలా అనుకోకూడదు అని ఆడపిల్ల పుడితే వారికి పదివేలు ఇస్తానని అ గ్రామ సర్పంచ్ ప్రకటించారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేయడంతో పాటు తన సొంత డబ్బులతో గ్రామాన్ని ప్రగతి పధంలో ముందుకు దూసుకుని వెళ్లే లాగా చేయాలనీ వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండల మరియపురం గ్రామ సర్పంచ్ అయిన అల్లం బాలిరెడ్డి సేవలు అందిస్తున్నారు.

ఈ గ్రామం పేరు మీరు వినే ఉంటారు.

దేశంలోనే ఆదర్శగ్రామంగా నిలిచింది మరియపురం గ్రామం.ఆడపిల్లకు జన్మనిస్తే ఆ ఆడబిడ్డ పేరు మీద సుకన్య సమృద్ధి యోజన కింద పోస్ట్ ఆఫీస్ లో పదివేల రూపాయిలు డిపాజిట్‌ చేయనున్నట్లు ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

నిర్మల ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ గా ఉన్న బాలిరెడ్డి 2019 ఫిబ్రవరిలో సర్పంచిగా పదవి చేపట్టారు.అప్పటి నుంచి ఆ గ్రామంలో 8 మంది ఆడపిల్లలు జన్మించారు.

Telugu Thousands, Announced, Baby, Born, Cash, Latest, Sarpanchbali, Thousand Ru

ఇప్పుడు వారందరికీ డబ్బు డిపాజిట్‌ చేయనున్నట్లు కూడా చెప్పారు.ఈ నెల 20వ తేదీన నిర్మల ఛారిటబుల్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపక దినోత్సవంలో భాగంగా బాలికల తల్లిదండ్రులకు డిపాజిట్‌ పత్రాలు అందజేస్తున్నట్లు చెప్పారు.గ్రామలోన్ బాలిరెడ్డి అనేక మంచి కార్యక్రమాలు కూడా చేసారు 2 లక్షల రూపాయలతో మినరల్‌వాటర్‌ ప్లాంట్‌ నిర్మించడంతో పాటుగా, రూ.1.80 లక్షల విలువైన చెత్త సేకరణ ఆటో, మొక్కలు పెంపకం, డంపింగ్ యార్డులు వంటి ఎన్నో కార్యక్రమాలను ఆయన సొంతంగా నిర్వహించి అందరికి ఆదర్శంగా నిలిచారు.అలాగే తాను పదవిలో ఉన్నంత వరకు ఇలా పుట్టిన ప్రతి ఆడబిడ్డకు పదివేల రూపాయిల సహాయం చేస్తానని అన్నారు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube