రాజకుటుంబంలో విషాదం, కరోనా కు బలైన రాకుమారి  

Mariya Terisa Corona Positive Spain Queen Royal Family - Telugu Corona Positive In Mariya Terisa, Corona Virus, Corona Virus In Spain, Mariya Terisa, Princess Maria Teresa Of Spain Becomes First Royal To Die From Covid-19, Royal Family

ప్రపంచ దేశాలను అల్లాడిస్తున్న కరోనా మహమ్మారికి రాజకుమారి బలైంది.స్పెయిన్ లో తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న ఈ కరోనా మహమ్మారికి స్పెయిన్ రాజకుటుంబీకురాలు కరోనా వైరస్ తో మృతి చెందింది.

 Mariya Terisa Corona Positive Spain Queen Royal Family

ఇలా ఒక రాజకుటుంబీకురాలు కరోనా వైరస్ తో చనిపోవడం ఇదే మొదటిసారి.కరోనా వైరస్ స్పెయిన్ లో విలయతాండవం చేస్తున్న విషయం తెలిసిందే.

స్పెయిన్ రాజు నాలుగో ఫెలిప్ కజిన్ ప్రిన్సెస్ మారియా తెరెసా గురువారం 86 ఏళ్ల వయసులో ప్యారిస్‌లో ప్రాణాలు కోల్పోయారు.ఆమె కరోనా పాజిటివ్ అనీ వ్యాధి పెరగడం వల్లే చనిపోయారు అని రాజ కుటుంబం అధికారికంగా ప్రకటించింది.

రాజకుటుంబంలో విషాదం, కరోనా కు బలైన రాకుమారి-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

రాయల్ ఫ్యామిలీలో తొలి కరోనా పాజిటివ్ మరణంగా ఇది నమోదైంది.శుక్రవారం స్పెయిన్ రాజధాని మాడ్రిడ్‌లో అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలుస్తుంది.

అమెరికా,ఇటలీ తరువాత అదేస్థాయిలో కరోనా విజృంభిస్తున్న దేశాల్లో స్పెయిన్ ఒకటి.స్పెయిన్ లో శనివారం కొత్తగా 7513 కేసులు నమోదు అవ్వడం తో మొత్తం కేసుల సంఖ్య 73232 కి చేరింది.

శనివారం 844 మంది చనిపోవడంతో… మృతుల సంఖ్య 5982కి చేరింది.ఇటలీ తర్వాత స్పెయిన్ లోనే అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి.

మొత్తం మరణాల్లో సగం ఈ రెండు దేశాల్లోనే చోటుచేసుకున్నాయి.ఇటలీ లో కూడా 10 వేలకు పైగా మరణాలు చోటుచేసున్న విషయం తెలిసిందే.అగ్రరాజ్యం అమెరికా లో కూడా ఈ కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది.ఇప్పటి వరకు 1000 మందికి పైగా మృతి చెందగా, లక్షకు పైగా కరోనా వైరస్ తో చికిత్స పొందుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Related Telugu News,Photos/Pics,Images..