జనసేనానికి ఘలక్..పార్టీ వీడనున్న కీలక నేత..???  

Marisetti Raghavaiah Quits Jana Sena-

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి ఊహించని పరిణామాలు ముందు ముందు ఉంటాయని, పార్టీలో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తులే అన్నకు చివర్లో హ్యండ్ ఇచ్చినట్టుగా తప్పకుండా హ్యాండ్ ఇస్తారని గతకొంత కాలంగా కొంటామని రాజకీయ పండితులు హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు.అయితే తాజాగా జనసేన వర్గాలలో జోరుగా చర్చలకి వస్తున్నా ఏకైక అంశం ఇప్పుడు జనసేనలో గిల్లికజ్జాలని బయట పెడుతోంది.

Marisetti Raghavaiah Quits Jana Sena--Marisetti Raghavaiah Quits Jana Sena-

జనసేన నేతలు అందరూ ఒకే టీం గా ఒకే మాటపై ఉంటారని అనుకుంటుంటే ఇప్పుడు ఓ నేత మాత్రం సైడ్ అవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది.ఇంతకీ ఎవరా నేత.??పార్టీ ఆవిర్భావం మొదలు అన్ని విషయాలలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఏకైక వ్యక్తి మారిశెట్టి రాఘవయ్య.జనసేన పార్టీకి ట్రెజరర్ గా పవన్ నమ్మిన వ్యక్తులలో ఒకరిగా ఉన్న రాఘవయ్య ఇప్పుడు పవన్ పై అసంతృప్తిగా ఉన్నారని టాక్ విన్పిస్తోంది.

Marisetti Raghavaiah Quits Jana Sena--Marisetti Raghavaiah Quits Jana Sena-

కాకినాడ లోక్ సభ బరిలోకి దిగాలనేది రాఘవయ్య వ్యుహమని అందుకోసమే పార్టీలో ముందు నుంచీ పని చేస్తున్నారని అంటున్నారు.అయితే తాజా పరిస్థితులకి తగ్గట్టుగా ఆ సీటుని చిక్కాల తాతాజీ ఖాతాలోకి వెళ్లనుందని తెలియడంతో ఇప్పుడు రాఘవయ్య పవన్ పై తీవ్రస్థాయిలో అసంత్రుప్తిలో ఉన్నారని అంటున్నారు.

ఈ క్రమంలోనే రాఘవయ్య రాజీనామా చేసే ఆలోచనలో కూడాఉన్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.అంతేకాదు పార్టీలో జరుగుతున్న పరిణామాలతో ముత్తంశెట్టి కృష్ణారావు సైతం తీవ్ర అసహనంతో ఉన్నారనే టాక్ కూడా వినిపిస్తోంది.అంతేకాదు పవన్ చుట్టూ ఒక కోటరీ చేరుకుని, పార్టీని పూర్తిగా నాశనం చేస్తోందని ముత్తం శెట్టి సన్నిహితుల దగ్గర వాపోతున్నారట.

అయితే ఎన్నికలకి మరో మూడు నెలల సమయం మాత్రమే మిగిలి ఉండటంతో ఇప్పుడు జనసేనలో జరుగుతున్న తాజా పరిణామాలు పార్టీ నేతలని, కార్యకర్తలని ఆందోళనకి గురిచేస్తున్నాయి.మరి పవన్ ఈ విషయాలపై దృష్టి పెడితే బాగుంటుందని అంటున్నారు విశ్లేషకులు.