పరిశోధన ఫలితం, నాచు తో కూడా కరోనా కు చెక్

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి భారత దేశంలో కూడా ఏ స్థాయిలో విజృంభిస్తుందో అందరికీ తెలిసిందే.అయితే దీనికి ఎలాంటి మందు అందుబాటులో లేకపోవడం తో భౌతిక దూరం పాటిస్తూ ఈ కరోనాకు చెక్ పెట్టాలి అంటూ నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.

 Marine Red Algae,  Covid-19 ,reliance Researchers, Covid-19 Prevention,viral Dis-TeluguStop.com

కొంచం అశ్రద్ధ వహిస్తే మాత్రం మృత్యువు రూపంలో ఈ మహమ్మారి కబళించేస్తుంది.ఇప్పటికే దేశవ్యాప్తంగా 9 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా,3 వందలకు పైగా కరోనా మృతులు చోటుచేసుకున్నాయి.

అయితే ఈ కరోనా కు మందు కనిపెట్టేందుకు ప్రపంచ దేశాలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఇప్పటికే కొన్నిటిని రెడీ చేసి ట్రయిల్స్ కూడా చేస్తున్నారు.

భారత్ లో కూడా ఈ మహమ్మారికి మందు కనిపెట్టేందుకు పలువురు శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉండగా,తాజాగా ముఖేష్ అంబానీ కి చెందిన రిలయన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ సెంటర్ శాస్త్రవేత్తలు ఒక కొత్త విషయాన్నీ కనుగొన్నారు.
సముద్రంలో ఉండే నాచుకి కరోనా ను ఎదుర్కొనే శక్తి ఉందని ఈ శాస్త్రవేత్తలు కనిపెట్టారు.

సముద్రంలో దొరికే ఓ రకమైన ఎరుపు రంగు నాచుతో కరోనాకి చెక్ పెట్టవచ్చని రిలయన్స్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పొర్ఫీరీడియం సల్ఫేటెడ్ రకపు ఎరుపు నాచు నుంచి ఉప్పతి అయ్యే పాలీ శాచురైడ్‌లు,శ్వాసకోశ సమస్యలకు కారణమయ్యే కరోనా కుటుంబానికి చెందిన వైరస్‌లను అడ్డుకొని.

బలమైన యాంటీ వైరల్ ఏజెంట్లుగా పనిచేస్తాయని దీంతో.కరోనా యాంటీ వైరల్ మందులే కాకుండా శానిటరైజ్ వస్తువులపై కూడా వైరస్ చేరకుండా కోటింగ్ వేయవచ్చని తమ రీసెర్చ్‌ ద్వారా శాస్త్రవేత్తలు తెలియజేశారు.

Telugu Covid, Reliance, Diseases-

ముందుగా వాటితో గ్రూప్ ఉద్యోగులపై పరీక్షలు చేసి, ఆ తర్వాత మార్కెట్‌లో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.ఇప్పటికే ప్లాస్మా థెరపీ ద్వారా ఈ కరోనా కు చెక్ పెట్టొచ్చు అని కొందరు చెబుతుండగా ఇప్పుడు ఈ నాచు ద్వారా కూడా చెక్ పెట్టొచ్చు అంటూ రిలయన్స్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube