భారతీయ విద్యార్ధులకి అమెరికా ప్రతిష్టాత్మక అవార్డ్...   Marconi Society WAard For Pollution Control App     2018-11-07   13:34:08  IST  Surya

మనం తీసే ఫోటోల ద్వారా అక్కడ గాలిలో ఉండే కాలుష్యాన్ని ఏ స్థాయిలో ఉండే పసిగట్టగలిగే యాప్ ని రూపొందించిన ఢిల్లీ కి చెందిన ఇంజనీరింగ్ విద్యార్ధులకి అమెరికా ప్రతిష్టాత్మక మార్కొనీ సొసైటీ అవార్డు దక్కింది.

భైరవి విద్యాపీఠ్‌ ఇంజనీరింగ్‌ కాలేజీకి చెందిన తన్మయ్‌ శ్రీవాస్తవ, కనిష్క్‌ జీత్‌, ప్రేరణ ఖన్నాల విద్యార్థుల బృందం రూపొందించిన ఈ యాప్‌.. మార్కొనీ సొసైటీ ఆధ్వర్యంలో సెలిస్టిని కార్యక్రమంలో నిర్వహించిన పోటీలో మొదటి స్థానంలో నిలిచింది.

ఈ యాప్ కాలుష్య నియంత్రణకి ఎంతో ఉపయోగకరమని ఇంతటి అద్భుతమైన యాప్ ని రూపొందించడం ఎంతో గొప్ప విషయమని అంటున్నారు నిపుణులు..అయితే…ఇమేజ్‌ ప్రాసెసింగ్‌ మెళకువలు ఉపయోగించి మెషీన్‌ లర్నింగ్‌ మోడల్‌ వినియోగదారుని ప్రదేశంలో గాలి నాణ్యత స్థితిగతులను అంచనా వేస్తుందని అని తెలిపారు.

Marconi Society WAard For Pollution Control App-

గూగుల్‌ ప్లే లో టెన్నార్‌ ఫ్లో పేరుతో ఈ యాప్‌ ఉంది. ఢిల్లీ వంటి గాలి కాలుష్య ప్రాంతాల్లో ఈ యాప్‌ ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని వాడటం చాలా తేలిక, ఉచితం అని మార్కొనీ సొసైటీ పేర్కొంది. ఇందుకు విద్యార్థుల బృందం రూ.1.09 కోట్ల నగదు బహుమతి గెలుచుకుంది…భారత్ లో ఇటువంటి సృజనాత్మకత కలిగిన విద్యార్ధులు ఎందఱో ఉన్నారాని సొసైటీ పేర్కొంది.