నెల రోజుల్లో పెళ్లి.. ఇంతలో 'బాయ్ ఫ్రెండ్'తో 'ట్రిప్'కు వెళ్లి కారు ప్రమాదంలో నటి మృతి

సాధారణంగా రోడ్డు ప్రమాదాలలో ఎంతో మంది మరణించిన సినీ సెలబ్రిటీలు ఉన్నారు.తాజాగా ఇలాంటి రోడ్డు ప్రమాదంలో మరాఠీ నటి ఈశ్వరి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది.

 Marathi Actor Ishwari Deshpande Dies After Her Car Plunges Into Creek In Goa-TeluguStop.com

చిన్నప్పటినుంచి ఇండస్ట్రీలో నటించాలని కలలు కన్నా ఈశ్వరి ఎన్నో మరాఠీ హిందీ చిత్రాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల నుంచి నటి శుభమ్ డెడ్జ్ అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నారు.

అయితే మరొక నెల రోజులలో వీరిద్దరు వివాహబంధం ద్వారా ఒక్కటి కాబోతున్న నేపథ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది.

 Marathi Actor Ishwari Deshpande Dies After Her Car Plunges Into Creek In Goa-నెల రోజుల్లో పెళ్లి.. ఇంతలో బాయ్ ఫ్రెండ్’తో ట్రిప్’కు వెళ్లి కారు ప్రమాదంలో నటి మృతి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తన ప్రియుడితో కలిసి సెప్టెంబర్ 15న గోవా హాలిడే ట్రిప్ వెళ్ళిన వీరు ప్రయాణిస్తున్న కారు సోమవారం తెల్లవారుజామున అర్పారో గ్రామానికి సమీపంలోని బాగా కలాంగుట్ వంతెనపై అదుపుతప్పి లోయలో పడిపోయింది.

అయితే వీరి కారుకు సెంట్రల్ లాక్ చేసి ఉండటం వల్ల వీరిద్దరు బయటకి రావడానికి ఆస్కారం లేకుండా పోయింది.సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే మంచి గుర్తింపు తెచ్చుకొని ఎన్నో సినిమాలలో నటించిన ఈమె ఇలా రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Telugu Actress Ishwari Car Accident, Bolywood, Boyfriend Subham Dedge, Boyfriend Trip, Goa, Ishwari, Ishwari Dies, Marathi Acrtress Ishwari Pande, Marriage-Movie

వచ్చే నెలలో తమ కుటుంబ సభ్యులు వీరికి నిశ్చితార్థం కూడా ఏర్పాటు చేశారు.కానీ కారు ప్రమాదంలో వీరిద్దరు మరణించడంతో రెండు కుటుంబాలలో తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.సరదాగా హాలిడే ట్రిప్.కి వెళ్లి వస్తారనుకుంటే తిరిగిరాని లోకానికి వెళ్లారని కుటుంబ సభ్యులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు.వీరి అకాల మరణం ఇండస్ట్రీకే కాకుండా ఎంతోమంది పలువురు సెలబ్రిటీలకు తీవ్ర విషాదంలో ముంచింది.ఈ క్రమంలోనే కొందరు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

#BoyfriendSubham #Ishwari #Bolywood #MarathiAcrtress #Ishwari

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు