ఆస్తి కోసం కొట్లాడుతున్న మారడోనా ప్రియురాళ్లు..!  

తాజాగా ఫుట్ బాల్ దిగ్గజం మారడోనా మరణించిన విషయం అందరికి తెలిసిందే.తాజాగా ఆయనకు సంబంధించిన ఆస్తి పంపకాల విషయంలో కాస్త వివాదం నెలకొంది.

TeluguStop.com - Maradona Girlfriends Fighting For Property

ఆయన ఆస్తి ఎవరికి చెందాలన్న విషయంపై వీలునామా రాయకుండానే మారడోనా చనిపోవడంతో బంధువుల మధ్య తగాదాలు పెద్దఎత్తున మొదలయ్యాయి.మారడోనా ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం ఏకంగా 600 కోట్లకు పైగా ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఇకపోతే మారడోనా కు ఇద్దరు కూతుర్లు మాత్రమే కాకుండా అతను రహస్య భార్యలకు కూడా కలిగిన సంతానం వల్ల ఇప్పుడు అసలైన వివాదం నెలకొంది.ప్రపంచం మొత్తానికి మారడోనాకి కేవలం ఇద్దరు కుమార్తెలు మాత్రమే ఉన్నట్లు తెలుసు.

TeluguStop.com - ఆస్తి కోసం కొట్లాడుతున్న మారడోనా ప్రియురాళ్లు..-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే ఇది వరకు ఓ కుమార్తె మారడోనాతో ఆస్తుల పంపకం విషయంలో గొడవ పడినట్లు, దాని కారణంగా తన ఆస్తి మొత్తం సేవా సంస్థలకు ఇస్తానన్న విషయం అప్పట్లో సంచలనంగా మారింది.ఆయన వివాహ జీవితంలో క్లాడియా ను వివాహం చేసుకుని ఇద్దరు కుమార్తెలను జన్మనిచ్చాడు.

కాకపోతే ఆ తర్వాత మారడోనా 2003లో తన భార్యకు విడాకులు ఇచ్చి సపరేట్ గా ఉన్నాడు.ఆ తర్వాత కొన్ని రోజులకు ఇటలీ దేశానికి చెందిన గాయని క్రిస్టియానా ను వివాహం చేసుకున్నాడు.

వీరిద్దరికీ కలసి ఓ కుమారుడు కూడా జన్మించాడు.అంతేకాకుండా మారడోనా తన ప్రేయసితో సహజీవనం చేసి జాన అనే సంతానానికి కూడా తండ్రి అయ్యాడు.

అంతేకాదు మరొక మహిళ సహజీవనం చేసి ఆమెతో కూడా ఓ బిడ్డకు జన్మనిచ్చారు.ఇలా ఒక్కొకటిగా రహస్య సంబంధాలు బయటకు రావడంతో ఇప్పుడు వారి మధ్య ఆస్తి తగాదాలు ఎక్కువ.

తాజాగా మారడోనా తన 60 ఏట గుండెపోటు కారణంగా కన్నుమూసిన సంగతి తెలిసిందే.అర్జెంటీనా దేశంలోని టీగ్రె పట్టణంలో తన సొంత నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు.ఇదివరకే ఆయనకు మెదడులో రక్తం గడ్డ కట్టడడం వల్ల చికిత్స జరగడంతో ఆయన కోలుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా ఈ సంఘటన జరిగింది.అయితే ఆ సర్జరీ తర్వాత చనిపోయే వారం రోజుల క్రితమే ఆయన హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు.

అయితే ఇంట్లోనే మారడోనా గుండెపోటు కారణంగా హఠాత్మరణం చెందారు.

#Affairs #Football #Property #Marodana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు