మరదలి పెళ్లి ఆపడానికి అక్కమొగుడు ఎలాంటి ప్లాన్ వేశాడో తెలుసా.? చివరకు ఏమైందంటే.?       2018-07-08   23:14:01  IST  Raghu V

ఇటీవల నిశ్చితార్తం అయ్యింది. శనివారం వివాహం జరగాల్సి ఉంది. ఇంతలో వరుడు పెళ్లి కాన్సుల్ అన్నాడు. కట్నం గొడవ కాదు. కారణం అతనికి వాట్సాప్ లో వచ్చిన అశ్లీల ఫోటోలు. ఆమెకి కాబోయే వరుడుకి మార్ఫింగ్‌ ఫొటోలు పంపి ఆఖరి నిమిషంలో పెళ్లి నిలిపివేయించిన ఘటన తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో చోటు చేసుకుంది. ఆ ఫోటోలు పంపింది ఎవరో కాదో.స్వయానా ఆమె అక్క మొగుడు. వివరాల లోకి వెళ్తే..

మరదలిపై కన్నేసిన అక్క మొగుడు.. ఆమెకి కాబోయే వరుడుకి మార్ఫింగ్‌ ఫొటోలు పంపి ఆఖరి నిమిషంలో పెళ్లి నిలిపివేయించాడు. తన భార్య ఉపాధి కోసం కువైట్‌కి వెళ్లడంతో.. మరదలిని పెళ్లి చేసుకోవాలని అతను ఆశించాడు. కానీ.. ఆమెకి ఇటీవల పెళ్లి నిశ్చయం కాగా ఎలాగైనా ఆ వివాహాన్ని ఆపించాలని ఆమె బావ ఈ దుశ్చర్యకి పాల్పడ్డాడు.

వృత్తిరిత్యా ఫొటో, వీడియో గ్రాఫర్ అయిన అతను.. తన మరదలి ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్‌ చేసి అశ్లీలంగా వరుడు మొబైల్‌కి పంపాడు. దీంతో.. పెళ్లి ఆఖరి నిమిషంలో వరుడు తాను ఈ వివాహం చేసుకోనని బంధువులతో తెగేసి చెప్పాడు. తన ఫోన్‌కి వచ్చిన వాటిని చూపాడు. దీంతో.. కంగారుపడిన వధువు కుటుంబ సభ్యులు ఆరా తీసి.. అది తమ పెద్ద అల్లుడు అరాచకమేనని తేల్చారు. అనంతరం వధువు తండ్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.